Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం

Read Time:  1 min
Bihar Elections
Bihar Elections
FONT SIZE
GET APP

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ఓట్ల లెక్కింపులో ప్రారంభ ట్రెండ్‌లు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన, వివాదాస్పద నియోజకవర్గం మోకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, ఆయన ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని లెక్కింపు స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రౌండ్ల (Bihar Elections)కౌంటింగ్ పూర్తయ్యింది. తొలి రౌండ్ల నుంచి ప్రారంభమైన ఆధిక్యం మరింత పెరిగి, ఒక దశలో సుమారు 30 వేల ఓట్ల లీడ్ నమోదైంది. ప్రస్తుతం కూడా 11 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు.

Read Also: Bihar Elections: నితీష్-మోదీ జంట సక్సెస్… తేజస్వీ మరోసారి వెనుకబాటు

Bihar Elections
Bihar Elections

జైలు నుంచే ప్రచారం లేకుండా పోటీ చేసిన అనంత్ సింగ్,(Anant Singh) తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవిపై స్థిరమైన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. 2020లో ఆర్జేడీ తరఫున విజయం సాధించిన అనంత్ సింగ్, తర్వాత ఒక కేసులో అనర్హత ఎదుర్కొని, ఈసారి జేడీయూ తరఫున బరిలోకి దిగారు. అయినప్పటికీ మోకామాలో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని ఈ ట్రెండ్‌లు సూచిస్తున్నాయి.

నియోజకవర్గంలో ‘చోటే సర్కార్ విడుదల కానున్నాడు’ అనే జోష్ స్పష్టంగా కనిపిస్తోంది.
జైల్ కా ఫాటక్ టూటేగా… హమారా షేర్ చూటేగా” అంటూ పోస్టర్లు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఆయన గెలుపు కోసం శిబిరంలో ముందుగానే వేడుకల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్వీట్లు, భోజనం సిద్ధం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తం చూస్తే, మోకామాలో అనంత్ సింగ్ ప్రభావం తిరిగి మరొక్కసారి స్పష్టమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.