📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Bihar Election:ఆర్‌జేడీలో ముదురుతున్న వివాదం ఎటుతేలని అభ్యర్థుల ఖరారు

Author Icon By Sushmitha
Updated: October 15, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly) ఎన్నికల వేళ ప్రధాన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొందరు అభ్యర్థులకు పార్టీ టికెట్లు (బీఫారాలు) పంపిణీ చేయగా, ఆయన చిన్న కుమారుడు, పార్టీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆ టికెట్లను వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. తండ్రీకొడుకుల నడుమ ఆధిపత్య పోరు సాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విభేదాల కారణంగా విపక్షాల మహాఘట్ బంధన్ (మహాకూటమి) కూడా షాకైంది, ఎందుకంటే అధికార ఎన్డీఏ ఇప్పటికే పొత్తు ఖరారు చేసుకుని అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తోంది.

Read Also: Hyd Crime:ప్రేమ పేరుతో మోసపోయిన  యువతి.. అబార్షన్ వికటించి మృతి

టికెట్ల పంపిణీ, తేజస్వి అభ్యంతరం

ఐఆర్‌సీటీసీ(IRCTC) కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టులో హాజరైన లాలూ, ఆయన భార్య రాబ్డీదేవి ఇటీవల పట్నాకు చేరుకున్నారు. తర్వాత టికెట్ ఆశావహులకు లాలూ నివాసం నుంచి ఫోన్లు వెళ్లాయి. జేడీయూ నుంచి ఆర్జేడీలోకి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యేలు సునీల్ సింగ్, నరేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో, ఆర్జేడీ సిట్టింగ్ సభ్యులు భాయ్ వీరేంద్ర, చంద్రశేఖర్ యాదవ్ వంటి వారితో సహా పలువురు లాలూ ఇచ్చిన బీఫారాలతో ఆనందంగా బయటకు వచ్చారు. అయితే, కొద్ది గంటల తర్వాత పట్నా చేరుకున్న తేజస్వికి ఈ విషయంపై మనస్తాపం చెందారు. భాగస్వామ్య పక్షాలతో సీట్ల లెక్క తేలకుండా తండ్రి టికెట్లు పంపిణీ చేయడం సరైంది కాదని తేజస్వి నచ్చజెప్పారు. రాత్రి పొద్దుపోయాక చర్చించిన తర్వాత సాంకేతిక కారణాల పేరు చెప్పి ఆ నేతలందరి నుంచి తేజస్వి బీఫారాలు వెనక్కి తీసుకోవడం సంచలనం సృష్టించింది.

కాంగ్రెస్ జోక్యం, సీట్ల సర్దుబాటు సమస్య

గత లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల్లోనూ లాలూ ఏకపక్షంగా వ్యవహరించి, గెలిచే సీట్లు కాకుండా ఓడిపోయేవి ఇచ్చారని మిత్రపక్షాలు ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అలాగే వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి తేజస్విపై ఒత్తిడి తెచ్చింది. 243 స్థానాలు గల బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ 70-75 సీట్లు, వీఐపీ పార్టీ 50 సీట్లు (ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు), సీపీఐ, సీపీఎంలు 24 స్థానాలు కోరుతున్నాయి. ఆర్జేడీ కనీసం 134 సీట్లలో పోటీచేయాలని భావిస్తోంది. ఇది ప్రతిపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యను తీవ్రతరం చేస్తోంది.

బీజేపీ తొలి జాబితా విడుదల

ఇదిలా ఉండగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 71 మందితో తన తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నంద కిశోర్ యాదవ్‌కు(Nanda Kishore Yadav) సీటు ఇవ్వలేదు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరికి సీటు దక్కింది. ఈ ముగ్గురూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారే కావడం విశేషం.

ఆర్జేడీలో వివాదం ఎవరి మధ్య తలెత్తింది?

పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన చిన్న కుమారుడు, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ల మధ్య ఈ వివాదం తలెత్తింది.

తేజస్వి యాదవ్ టికెట్లను ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

మిత్రపక్షాలతో సీట్ల లెక్క తేలకుండా తండ్రి టికెట్లు పంపిణీ చేయడం సరికాదని ఆయన భావించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar Elections Google News in Telugu lalu prasad yadav Latest News in Telugu Mahagathbandhan political conflict. RJD Tejashwi Yadav Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.