📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు

Author Icon By Saritha
Updated: February 25, 2026 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bihar: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేదికపై ఉన్న వధువును ఒక దుండగుడు తుపాకీతో కాల్చడంతో సంబరాలన్నీ ఒక్కసారిగా రోదనలుగా మారాయి. వివరాల్లోకి వెళితే.. చౌసా నగర్ పంచాయతీ పరిధిలోని మల్లా తోలా గ్రామానికి చెందిన ఆర్తి కుమారికి మంగళవారం రాత్రి వివాహం జరుగుతోంది. వేడుకల్లో భాగంగా ఆర్తి స్టేజ్ పైన వరుడితో కలిసి ఉంది. బంధువులంతా చుట్టూ నిలబడి ఉండగా ఆర్తి కుమారి సోదరి తనకు కాబోయే బావకు తిలకం దిద్దుతోంది. సరిగ్గా అదే సమయంలో అతిథుల మధ్యలో ఉన్న దీనబంధు అనే యువకుడు ఆర్తిపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ నేరుగా ఆర్తి పొట్టలోకి దూసుకెళ్లింది.

Read Also: Chardham Yatra 2026: కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల ప్రారంభ తేదీలు ఖరారు!

Bihar: Bride shot at wedding venue

ప్రేమ వ్యవహారమే కారణమా..?

తుపాకీ శబ్దంతో పెళ్లి పందిరిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రక్తపు మడుగులో పడిపోయిన ఆర్తిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను వారణాసిలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా నుంచి వచ్చిన పెళ్లి బృందం వివాహం జరగకుండానే వెనుదిరిగింది.

నిందితుడు దీనబంధు వధువు ఇంటి పొరుగునే ఉంటాడని సమాచారం. వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలో మద్యం కేసుకు సంబంధించి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా, విచారణ నిమిత్తం అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bihar News Bride Shot in Bihar Buxar Crime Latest News in Telugu Love Affair Crime Telugu News Wedding Shooting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.