అయోధ్య రామమందిర దర్శన సమయాల్లో మార్పులు:
అయోధ్య: భక్తుల సౌకర్యార్థం అయోధ్య శ్రీరామ (Sri Rama) జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ దర్శన సమయాల్లో(Big update) మార్పులు చేసింది. శీతాకాలం ప్రారంభమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. కొత్త దర్శన సమయాలు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మార్పుల ప్రకారం దర్శన వ్యవధిని గంట తగ్గించారు.
Read also: మారనున్న బ్యాంకు నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలు
కొత్త దర్శన సమయాలు ఇలా ఉన్నాయి
మంగళ హారతి – తెల్లవారుజామున 4:00 గంటలకు, శృంగార్ హారతి – ఉదయం 6:30 గంటలకు, భక్తుల ప్రవేశం ప్రారంభం – ఉదయం 7:00 గంటలకు, భోగ హారతి – మధ్యాహ్నం 12:00 గంటలకు, ఆలయ తలుపులు మూసివేత – 12:30 నుండి 1:00 గంటల వరకు, దర్శనం తిరిగి ప్రారంభం – మధ్యాహ్నం 1:00 గంటలకు, దర్శన ముగింపు సమయం – రాత్రి 9:30 గంటలకు,అనంతరం శయన హారతి నిర్వహిస్తారు.
భక్తుల ప్రవేశానికి కొత్త నియమాలు
గతంలో ఉదయం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తుండగా, ఇప్పుడు మార్పుల ప్రకారం 7:00 గంటల నుండి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. బిర్లా ధర్మశాల ముందు గేటు వద్ద ఉదయం 8:30 గంటలకు ప్రవేశం మూసివేయబడుతుంది. సెక్యూరిటీ గేట్ D1 ద్వారా ఉదయం 9 గంటల తర్వాత ప్రవేశం ఉండదని ట్రస్ట్ స్పష్టం చేసింది.
శీతాకాల షెడ్యూల్ భక్తుల సౌకర్యం కోసం
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిన ప్రకారం, వాతావరణ(Big update) పరిస్థితులు, భక్తుల రద్దీ, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భక్తులు కొత్త సమయాలను పాటించాలని, సకాలంలో ఆలయానికి రావాలని విజ్ఞప్తి చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: