మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యంత భద్రతా ప్రాంతంగా పేరుగాంచిన చార్ ఇమ్లీ కాలనీలో అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ డాక్టర్ ఆశీష్(Ashish) ఉదయం తన భార్యతో కలిసి నడకకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన రెండు మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు.
Read Also: Karur Stampede: తమిళనాడు ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం

పోలీసుల దర్యాప్తు
ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు(CCTV footage) పరిశీలించారు. పాత నేరస్థుల వివరాలు సేకరించి, సైబర్ ట్రాకింగ్ ద్వారా దొంగిలించిన ఫోన్ల చివరి లొకేషన్ దుర్గానగర్ వద్ద ఉన్నట్లు గుర్తించారు.
నిందితుల అరెస్ట్
దర్యాప్తులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిలో ఒకరిని ఆదిత్య (18)గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు మైనర్లు. పోలీసులు దొంగిలించిన ఒక ఫోన్‌ను సంఘటన స్థలానికి సమీపంలోనూ, మరొకదాన్ని ఓ పార్కులో పాతిపెట్టిన స్థితిలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
కేసు నమోదు
ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చార్ ఇమ్లీ ప్రాంతం ఉన్నతాధికారులు, మంత్రులు నివసించే హైసెక్యూరిటీ జోన్ కావడంతో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఘటన ఎక్కడ జరిగింది?
భోపాల్‌లోని చార్ ఇమ్లీ ప్రాంతంలో జరిగింది.
ఫోన్ ఎవరి దొంగిలించారు?
రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ డాక్టర్ ఆశీష్ ఫోన్లు దొంగిలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: