సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో ట్రాఫిక్ కష్టాలు, క్యాబ్ డ్రైవర్ల క్యాన్సిలేషన్లు, భారీ సర్జ్ చార్జీల గురించి తెలియని వారు ఉండరు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మద్దతుతో రూపొందించబడిన ‘భారత్ టాక్సీ’ త్వరలో నగరంలో అడుగుపెట్టనుంది. అయితే, ఈ సేవలు అందుబాటులోకి రావడానికి ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భారత్ టాక్సీ ప్రత్యేకతలేంటి? ‘ది సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ పూర్తిగా సహకార నమూనా పై పనిచేస్తుంది. అంటే ఇక్కడ డ్రైవర్లే యజమానులుగా ఉంటారు. ఎక్కడెక్కడ ఆగుతుందంటే? జీరో కమిషన్: ప్రస్తుత యాప్ ల వలె డ్రైవర్ల నుండి భారీ కమిషన్లు వసూలు చేయరు. భవిష్యత్తులో కేవలం స్వల్ప సబ్‌స్క్రిప్షన్ ఫీజు మాత్రమే ఉంటుంది. సర్జ్ ఫ్రీ ప్రైసింగ్: వర్షం పడినా రద్దీ పెరిగినా ప్రయాణికులపై అదనపు చార్జీల భారం పడకుండా ‘సర్జ్ ఫీ’ ని భారీగా నియంత్రించనున్నారు.
Read Also: PAN Card New Rules : పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
స్థానిక డ్రైవర్ల అసోసియేషన్లతో చర్చలు
మల్టీ మోడల్ రవాణా: కేవలం టాక్సీలే కాకుండా, నమ్మ మెట్రో నెట్‌వర్క్‌తో కూడా ఈ యాప్‌ను అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ని అందించడమే తమ లక్ష్యమని సీఈఓ వివేక్ పాండే తెలిపారు. బెంగళూరులో సవాళ్లు, నిబంధనలు బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించే ముందు స్థానిక డ్రైవర్ల అసోసియేషన్లతో చర్చలు జరుపుతామని భారత్ టాక్సీ యాజమాన్యం పేర్కొంది. అయితే ఇప్పటికే నగరంలో అనేక రవాణా యాప్ లు ఉండటం వల్ల డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారని ఆదర్శ ఆటో యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్లు అన్ని యాప్‌లను ఒకేసారి ఉపయోగించడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రభుత్వం దీనిపై కఠిన నిబంధనలు తీసుకురావాలని వారు కోరుతున్నారు.
బైక్ టాక్సీలకు అనుమతి లేదు!
గతంలో వచ్చిన ‘నగర మీటర్డ్ ఆటో’, ‘రూక్’ వంటి ప్లాట్‌ఫారమ్ లు బెంగళూరులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మరి భారత్ టాక్సీ వీటిని తట్టుకుని ఎలా నిలబడుతుందో చూడాలి. కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి భారత్ టాక్సీ గురించి మాట్లాడుతూ ఒక కీలక విషయం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్పష్టమైన బైక్ టాక్సీ పాలసీ లేనందున భారత్ టాక్సీలో బైక్ టాక్సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం క్యాబ్ లు, ఆటోలు , బైక్ టాక్సీ డ్రైవర్లను వేరుగా బోర్డింగ్ చేసుకున్నప్పటికీ అధికారిక పాలసీ వచ్చే వరకు బైక్ సేవలు అందుబాటులో ఉండవు. మొత్తానికి బెంగళూరు (Bengaluru) ప్రయాణికులకు ధరల భారం తగ్గించడానికి, డ్రైవర్లకు మెరుగైన ఆదాయం కల్పించడానికి భారత్ టాక్సీ ఒక గొప్ప వేదికగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: