దేశవ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు కలిసి నేడు భారత్ బంద్ (Bharat Bandh) నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక హక్కులను కాలరాయుతున్నాయని ఆరోపిస్తూ, ఈ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రధానంగా కార్మిక సంక్షేమంపై ప్రభావం చూపే విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం సాగుతోంది. బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
బంద్ ప్రభావిత రంగాలు
ఈ భారత్ బంద్ ప్రభావం ప్రధానంగా పరిశ్రమలు, పోస్టల్ సేవలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ప్రజారవాణా రంగాలపై కనిపించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు తాత్కాలికంగా సేవలు నిలిపివేయవచ్చని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుల నిలిపివేత కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రైవేటు రంగ బ్యాంకులు, స్వతంత్రంగా నడిచే సేవా రంగాలు యథాతథంగా పనిచేయవచ్చని అధికారులు తెలిపారు.
ప్రభావం లేని రంగాలు
ఈ బంద్‌కు విద్యా సంస్థలు, ప్రైవేటు ఆఫీసులు పెద్దగా ప్రభావితమయ్యే అవకాశాలు లేవు. పాఠశాలలు, కళాశాలలు యధావిధిగా పనిచేసే అవకాశముండగా, ఐటీ కంపెనీలు, ప్రైవేట్ కార్యాలయాలు కూడా సాధారణ కార్యకలాపాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, సంబంధిత విభాగాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అయినా, రవాణా రంగంలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉండడంతో ప్రజలు తమ ప్రయాణాలను ముందుగా పరిగణనలోకి తీసుకొని ప్లాన్ చేసుకోవాలి.
Read Also : Navodaya : ‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు