fake voters FIR : బెంగళూరు మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 లోక్‌సభ ఎన్నికల ముందు భారీ స్థాయిలో నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుతో బెంగళూరులో ‘వోటు చోరీ’ వివాదం మరోసారి హాట్‌టాపిక్ అయింది.
ఈ కేసు నేపథ్యంగా రాహుల్ గాంధీ పలుమార్లు “మహాదేవపురలో వోటు చోరీ జరిగింది… లక్షకు పైగా నకిలీ ఓటర్లను జోడించారు” అని ఆరోపించారు. 2024 ఎన్నికలలో బీజేపీ, ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా మార్పులకు సహకరించిందన్న అభియోగాలు కూడా చేశారు.
Read also: Reservation-GO: 50% పరిమితిలోనే కొత్త రిజర్వేషన్లు—GO సిద్ధం
వైట్‌ఫీల్డ్‌కు చెందిన వీటీ రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు (fake voters FIR) నమోదు చేశారు. ఎన్నికల ముందు నకిలీ ఓటర్లను అక్రమంగా చేర్చడంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి పెద్ద కుట్ర పన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చడం వెనుక కొన్ని ప్రభుత్వ అధికారులు, లాభం పొందిన పార్టీ సభ్యులు, తెలియని వ్యక్తుల కలిసికట్టిన కుట్ర లేకుండా సాధ్యం కాదు” అని రాజు FIRలో పేర్కొన్నారు.
ఈ చర్య ప్రజల తీర్పును వక్రీకరించే ప్రయత్నం అంటూ, ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేశారు.
IPCలోని పలు సెక్షన్లు, ప్రజాప్రతినిధుల చట్టం 1951 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :