Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్

Read Time:  1 min
Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్
FONT SIZE
GET APP

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువ బాడీబిల్డర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రియురాలికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడంతో అతను ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన కిరణ్ (26) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ, బాడీబిల్డర్‌గా రాణిస్తున్నాడు. గత మూడేళ్లుగా అతను ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు.

Read Also: Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు

సూసైడ్ నోట్‌లో ప్రియురాలు, ఆమె తల్లి పేర్ల ప్రస్తావన

అయితే శనివారం సాయంత్రం ప్రియురాలిని కలిసినప్పుడు ఆమె తనకు షాకిచ్చింది. వేరొక వ్యక్తితో తన వివాహం నిశ్చయమైందని, ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని చెప్పింది. అంతేకాదు, తన పెళ్లి కోసం కొనుగోలు చేసిన చీరను, ఆహ్వాన పత్రికను కూడా కిరణ్‌కు చూపించింది.ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కిరణ్, ఇంటికి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.

Bengaluru: Unable to bear girlfriend's engagement, bodybuilder commits suicide
Bengaluru: Unable to bear girlfriend’s engagement, bodybuilder commits suicide

ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కిరణ్ గదిలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లే కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.