Bengaluru strange theft case : బెంగళూరులో మహిళల లోదుస్తులను దొంగిలిస్తూ వింతగా ప్రవర్తిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల బాల్కనీల్లో, బయట ఆరవేసిన మహిళల లోదుస్తులను దొంగిలించి, వాటిని ధరించి వీడియోలు తీసుకుంటున్నాడని విచారణలో తేలింది. నిందితుడు కేరళకు చెందిన 23 ఏళ్ల అముల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హెబ్బగోడి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుడి కదలికలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, పెద్ద మొత్తంలో మహిళల లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Google : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, దొంగిలించిన (Bengaluru strange theft case) లోదుస్తులు ధరించి తీసుకున్న అనేక వీడియోలు బయటపడ్డాయి. మహిళల లోదుస్తులు వేసుకున్నప్పుడు తనకు ప్రత్యేకమైన మానసిక ఉత్సాహం కలుగుతుందని అముల్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని దొంగతనం, గృహ అతిక్రమణ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసుల కింద దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ బెంగళూరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: