DK Shivakumar speech : బెంగళూరు–హైదరాబాద్ సహకారమే దక్షిణాభివృద్ధికి కీలకం డీకే శివకుమార్…

Read Time:  1 min
DK Shivakumar speech
DK Shivakumar speech
FONT SIZE
GET APP

DK Shivakumar speech : రంగా రెడ్డి జిల్లా (మీర్ ఖాన్‌పేట) కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దక్షిణ భారత ఆర్థిక అభివృద్ధికి పోటీ కాదు – సహకారమే కీలకం అని స్పష్టంగా చెప్పారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే గ్లోబల్ స్థాయిలో నిలదొక్కుకోవడం ప్రశంసనీయం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. గతంలో తెలంగాణను బెంగళూరు పోటీదారుగా చూసిన తన ఆలోచన ఈ సదస్సుతో పూర్తిగా మారిందన్నారు.
“ఈ సదస్సు స్థాయి, విజన్ చూసిన తర్వాత తెలంగాణ స్థానికంగా పోటీ చేయడం కాదు, ప్రపంచంతో కలిసి పనిచేస్తోందని అర్థమైంది,” అని వ్యాఖ్యానించారు.

Latest News: TG Drone Show:గ్లోబల్ సమ్మిట్‌లో చారిత్రక ఘట్టం: డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డు నమోదు

త్వరలో విడుదల కానున్న విజన్–2047 డాక్యుమెంట్ భవిష్యత్ తరాలకు స్పష్టమైన (DK Shivakumar speech) దారిదీపమని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో బాధ్యతలు ఉన్నప్పటికీ, తన మిత్రుడు రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌కి వచ్చినట్లు చెప్పారు.

దక్షిణ రాష్ట్రాలు ఇప్పటికే దేశ జీడీపీలో 30 శాతం వాటా అందిస్తున్నాయని, భవిష్యత్తులో ఈ షేర్ 40–45 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. బెంగళూరులో దాదాపు 25 లక్షల ఇంజినీర్లు పనిచేస్తుండగా, హైదరాబాద్ కూడా వేగంగా టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని పేర్కొన్నారు.

“భారత్ టెక్నాలజీ కథను చెప్పాలంటే బెంగళూరు–హైదరాబాద్ రెండింటినీ కలిసి చెప్పాల్సిందే,” అంటూ రెండు నగరాలు ప్రత్యర్థులు కాదు, సహజ భాగస్వాములని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు రెండు రాష్ట్రాలపై నమ్మకం పెట్టుకోవాలని, ప్రణాళికాబద్ధత, కష్టపడి పని చేయడం, నిజాయితీతో దక్షిణ భారత అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.