📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Bengaluru: చెత్తను ఇంట్లో పెట్టుకుంటే జరిమానా.. వీధిలో పడేస్తే అరెస్ట్..

Author Icon By Rajitha
Updated: November 12, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bengaluru: బెంగళూరులో చెత్త సమస్య తీవ్రమవుతుండటంతో నగర పాలక సంస్థ బీబీఎంపీ (BBMP) పెద్ద ఎత్తున శుభ్రతా డ్రైవ్ ప్రారంభించింది. ముఖ్యంగా బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలు చెత్త కుప్పలుగా మారిపోవడంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కమిషనర్ పొమ్మల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచని యజమానులపై జరిమానాలు విధించడమే కాకుండా, అవసరమైతే శుభ్రతా ఖర్చును ఆస్తిపన్నుల ద్వారా వసూలు చేస్తామని హెచ్చరించారు. పులకేశినగర్, సర్వజ్ఞనగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్, చెత్తతో నిండిన స్థలాలను పరిశీలించి వెంటనే శుభ్రపరిచే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Read also: Delhi Blast:ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబు పేలుళ్ల వెనక పాక్ సైన్యం.. ఆదేశ జర్నలిస్ట్ ఆరోపణ

Bengaluru: చెత్తను ఇంట్లో పెట్టుకుంటే జరిమానా..

బెంగళూరును శుభ్రంగా ఉంచడం

ఇక Bengaluru ఈస్ట్ సిటీ కార్పొరేషన్ పరిధిలో కూడా శుభ్రతా కార్యక్రమం వేగవంతమైంది. అదనపు కమిషనర్ లోఖండే స్నేహల్ సుధాకర్ ఆధ్వర్యంలో వడ్దరపాళ్య నుండి హెన్నూర్-బాగలూరు రోడ్ వరకు భారీ స్థాయిలో డ్రైవ్ నిర్వహించారు. కాలువల నుండి టన్నుల కొద్దీ బురదను తొలగించడం, గుంతలు పూడ్చడం, ఫ్లెక్స్ బ్యానర్లు తొలగించడం వంటి పనులు జరిగాయి. సుమారు 180 మంది కార్మికులు, 20 ట్రాక్టర్లు, 6 ఆటో టిప్పర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ, “బెంగళూరును శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత. ఇంట్లో చెత్త నిల్వచేయడం, లేదా వీధుల్లో పారేయడం కఠినంగా నిషేధం” అని హెచ్చరించారు.

భారీ జరిమానాలు

Bengaluru: బీబీఎంపీతో పాటు, బెంగళూరు (Bangalore) సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) కూడా ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. వీధుల్లో చెత్త పారేసే వారినే కాకుండా, ఇంట్లో చెత్త నిల్వచేసి తర్వాత వాహనాలకు ఇస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఉపగ్రహ చిత్రాలు, పత్రికల ఫిర్యాదుల ఆధారంగా చెత్త పారేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తారు. మొదట హెచ్చరికలు ఇచ్చి, తరువాత మాట వినకపోతే భారీ జరిమానాలు, అవసరమైతే ఆస్తిపన్నుల ద్వారా వసూళ్లు జరుపుతామని పేర్కొన్నారు. ఈ చర్యలతో బెంగళూరును శుభ్రమైన, పర్యావరణహిత నగరంగా మార్చడమే బీబీఎంపీ లక్ష్యం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BBMP bengaluru BSWML latest news Solid Waste Management Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.