
Bengaluru: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే పిచ్చి కొందరిలో మనుషులను ఏ స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ఇది ఒక పరాకాష్ఠ. కేవలం లైకులు, వ్యూస్ కోసం కన్నవారినే హింసించడానికి కూడా వెనుకాడటం లేదు. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ (HSR Layout) ప్రాంతంలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ మహిళ తన కన్నతండ్రినే గోనె సంచిలో కుక్కి, కొరియర్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది.
Read Also: Drugs Case CM Comments: మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!
తన తండ్రిని పెద్ద బస్తాలో బంధించి, దాన్ని గట్టిగా కట్టేసింది. అనంతరం ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్‌ను పిలిపించి తన వద్ద ఓ భారీ పార్శిల్ ఉందని, డెలివరీ చేయాలని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది, ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి కదలికలు రావడాన్ని గమనించారు. ఏదో వింతగా అనిపించి సంచి విప్పి చూడగా, లోపల ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడిని చూసి వారు షాక్‌కు గురయ్యారు. కొరియర్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మహిళను విచారించగా, వైరల్ రీల్ చేయడం కోసమే తండ్రిని అలా సంచిలో కట్టానని ఆమె ఒప్పుకుంది.
పోలీసులు ఆ వృద్ధుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: