📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Bengaluru Crime: డాక్టర్ కృతిక రెడ్డి హత్య.. ఐదుగురు మహిళలకు మెసేజ్ పంపిన భర్త

Author Icon By Tejaswini Y
Updated: November 5, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు(Bengaluru Crime) నగరంలో చోటుచేసుకున్న డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్‌లో బయటపడిన వివరాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. జనరల్ సర్జన్‌ డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్య మరియు స్కిన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కృతిక రెడ్డిని అనస్థీషియా ఇంజెక్షన్‌తో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మృతిచెందిన నాలుగు వారాల తర్వాత, మహేంద్ర ఐదుగురు మహిళలకు “నీ కోసమే నా భార్యను చంపేశా (I Killed My Wife For You)” అనే సందేశాన్ని పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందేశాన్ని సాధారణ మెసేజింగ్ యాప్స్‌ ద్వారా కాకుండా, ఒక డిజిటల్ పేమెంట్ యాప్ ట్రాన్సాక్షన్ నోట్స్‌ సెక్షన్‌లో పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించిన మొబైల్ డేటా, ల్యాప్‌టాప్‌ సమాచారంలో ఈ విషయాలు బయటపడ్డాయి.

Read Also: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి

పాత రిలేషన్లను కొనసాగించాలనే ప్రయత్నం

Bengaluru Crime: మహేంద్ర రెడ్డి గతంలో పరిచయమైన మహిళలతో మళ్లీ సంబంధాలు కొనసాగించేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమెసేజ్‌ అందుకున్నవారిలో మహేంద్ర ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన మరో వైద్యురాలు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ వివరాలు వెలుగులోకి రావడంతో, డాక్టర్ కృతిక కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మన పిల్లను ఇలా క్రూరంగా చంపినవాడికి కఠిన శిక్ష తప్పక పడాలి” అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మహేంద్ర రెడ్డి హత్యకు ముందు మరియు తర్వాత చేసిన అన్ని డిజిటల్ లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, భవిష్యత్తులో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

#DigitalEvidence BangaloreCrime BangaloreDoctorMurderCase DrKrithikaReddy DrMahendraReddy ForensicInvestigation IndianCrimeNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.