📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest News: BC reservations: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరుతూ ధర్నా

Author Icon By Saritha
Updated: December 16, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ధర్నాలో అఖిలపక్ష నేతలు

హైదరాబాద్ : రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని(BC reservations) ఎత్తేయాలని ఢిల్లీలో జరిగిన బీసీల ధర్నాలో అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, లేనిపక్షంలో దేశంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు బిసి జేఏసీ నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ(Delhi) పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు.

Read also :Minister Ponguleti: హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

BC reservations A protest was held demanding the removal of the 50 percent limit on reservations.

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై పోరాటం

ధర్నాలో(BC reservations) టీపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షులు సచిన్ రాజోలుకర్ హాజరయ్యారు బీసీ రిజర్వేషన్ల పెంపు పై కాంగ్రెస్ వెనుకడుగు వేయదనీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వైదొలగలేదని, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే చర్చించామని, త్వరలోనే కేంద్రంపై పోరాడడానికి తమ రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారా యణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బిజెపి అడుగడు గునా అడ్డుపడుతుందని, రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని విమర్శించారు. తెలం గాణ నుండి ఎన్నికైన ఎనిమిదిమంది బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందన్నారు. బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీరాజకీయ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

All Party Protest BC Reservations BC Welfare Association CPI Delhi Dharna Latest News in Telugu Reservation Limit 50 Percent Social Justice Telugu News TPCC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.