📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bat meat : చికెన్‌ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకం

Author Icon By Sudha
Updated: July 28, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో భయంకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. కామల్ మరియు శెల్వం అనే ఇద్దరు వ్యక్తులు గబ్బిలాల (Bat meat)ను వేటాడి, వాటి మాంసాన్ని వండుతూ, స్థానికులకు చికెన్‌ (Chicken)గా చెప్పి విక్రయిస్తున్నారు. ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులకు వచ్చిన సమాచారం ఆధారంగా వారు వారిని పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒమలూర్ సమీపంలోని డానిష్‌పేట్టై వద్ద గబ్బిలాల(Bat meat) వేటాడి, వాటిని వండుతున్నారు. అలా వండిన మాంసాన్ని చికెన్‌ పేరు చెప్పి అక్రమంగా విక్రయిస్తున్నారు. అయితే తోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో పలుమార్లు గన్‌షాట్‌ల శబ్దాలు వినిపించినట్టు తాజాగా అటవీ అధికారులకు సమాచారం అందింది. దాంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం ఎంక్వయిరీ చేపట్టింది. ఇద్దరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్‌ల (పండ్లు తినే గబ్బిలాలు) ను వేటాడి, వాటిని వండి, చికెన్‌లా విక్రయిస్తున్నట్లు ఆ ఎంక్వయిరీలో తేలింది.

Bat meat : చికెన్‌ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకం

దాంతో అధికారులు ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఇద్దరిలో ఒకరి పేరు కమల్‌, మరొకరి పేరు సెల్వం అని గుర్తించారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కాగా ఫ్రూట్ బ్యాట్‌లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్-II జాతిగా రక్షణ పొందుతున్నాయి. వీటిని వేటాడటం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 2021లో తుమకూరు జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్‌ల కళేబరాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కూడా వాటిని మాంసం కోసం బెంగళూరు, తుమకూరులో అమ్మేందుకు రవాణా చేస్తున్నారని తెలిసింది. ఫ్రూట్ బ్యాట్‌ల వేటవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిందితులు కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, సెక్షన్ 9, 39 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

గబ్బిలం తినవచ్చా?

గబ్బిలాలు పంటలను దెబ్బతీసే చిమ్మటలు మరియు బీటిల్స్ వంటి కీటకాలను కూడా తింటాయి. గబ్బిలాలు రాబిస్ మరియు ఇతర వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, గబ్బిలాల సహజ నివాసాలను చంపడం లేదా అంతరాయం కలిగించడం వల్ల రాబిస్ ఎక్కువ మందికి వ్యాపించవచ్చు. ఈ కారణంగా, గబ్బిలాలను చంపడం, వేటాడటం, అమ్మడం, ఉడికించడం లేదా తినకపోవడం మంచిది .

గబ్బిలం రక్తం తాగుతుందా?

1,400 కంటే ఎక్కువ గబ్బిల జాతులు ఉన్నాయి మరియు వాటిలో చాలా వరకు పండ్లు, తేనె, పుప్పొడి, కీటకాలు మరియు మాంసాన్ని కూడా తినడానికి ఇష్టపడతాయి. అయితే, రక్తం తాగే మూడు రక్త పిశాచ గబ్బిలా జాతులు ఉన్నాయి : సాధారణ రక్త పిశాచ గబ్బిలం (డెస్మోడస్ రోటుండస్), వెంట్రుకల కాళ్ళ వాంపైర్ గబ్బిలం (డిఫిల్లా ఎకాడాటా), మరియు తెల్లటి రెక్కల వాంపైర్ గబ్బిలం (డయామస్ యంగి)

గబ్బిలాలు మనిషిని కొరుకుతాయి?

గబ్బిలం కాటుకు గురైన చాలా మంది వ్యక్తులు కుట్టిన అనుభూతి లేదా సూది గుచ్చిన అనుభూతిని నివేదిస్తారు . అయితే, గబ్బిలం కాటు గుర్తించబడకపోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Uttar Pradesh: అనుమానంతో కాబోయే భార్యను హతమార్చిన

bat meat Breaking News BreakingNews chicken scam food fraud illegal meat trade latest news Tamil Nadu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.