📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Bank Scam: బ్యాంకు మోసం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు

Author Icon By Tejaswini Y
Updated: November 18, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చిన హరియాణాలోని ఫరీదాబాద్ లో గల అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు నకిలీ బ్యాంకుతో(Bank Scam) అమాయకులను టోకరా వేసిన కేసులో అరెస్టు చేశారు. 25 ఏళ్ల క్రితం ఈ గోల్మల్ వెలుగు చూడగా దీనిపై అప్పట్లో నమోదైన కేసులో ఇతను వాంటెడ్ నేరగాడు. ఇంతకాలం పరారీలో వున్న ఇతను ఢిల్లీ కారు బాంబు దాడి తరువాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీని(Javed Siddiqui) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతగాడి సోదరుడి భాగోతం రట్టయ్యింది. దీంతో ఢిల్లీ పోలీసుల సమాచారం మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని నగరంలో అరెస్టు చేశారు.

Read Also:  Karimnagar Crime: కన్నతండ్రే కాలయముడు

Alfalah University Chairman’s brother arrested for bank fraud

వివరాలలోకి వెళితే

వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతంలో 2000 సంవత్సరంలో హమూద్ అహ్మద్ సిద్ధిఖీ ఓ నకిలీ బ్యాంకును స్థాపించి అధిక వడ్డీ పేరుతో అమాయకుల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. దీనిపై కేసు నమోదవగా హమూద్ అహ్మద్ సిద్దిఖీ కుటుంబంతో సహా పారిపోయి హైదరాబాద్ కు మొహం మార్చి వేరే పేరుతో ఇక్కడ సాధారణ వ్యక్తిగా వుంటూ షేర్ మార్కెటింగ్ చేయసాగాడు. మరోవైపు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ కోసం మధ్యప్రదేశ్ పోలీసులు 25 ఏళ్లుగా గాలిస్తున్నా ఆచూకీ లభించక పోవడం తో ఈ కేసును పెండింగ్లో వుంచారు.

కాగా ఢిల్లీ పేలుడు తరువాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ గా వున్న జావెద్ సిద్దిఖీ పాత్రపై ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హరియాణా పోలీసులు విచారణ చేబట్టగా ఇతగాడి పై వున్న కేసులు ఇతని సోదరుడు హమూద్ అహ్మద్ సిద్దిఖీపై వున్న కేసుల సంగతి వెలుగు చూసింది. దీంతో హమూద్ అహ్మద్ సిద్దిఖీ గురించి ఢిల్లీ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఇతన్ని అరెస్టు చేసి తమ వెంట తీసుకుపోయారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AlfalaUniversity Arrest CyberCrime FakeBank fraud PoliceAction ScamAlert VictimCheating

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.