బ్యాంకుల్లో(Bank Rules) ‘లంచ్ బ్రేక్’ పేరుతో కస్టమర్లను వేచి ఉంచడం ఇప్పుడు నియమాలకు విరుద్ధం. రెజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టంగా పేర్కొంది — పబ్లిక్, ప్రైవేట్, కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ ఉండదు. భోజన సమయాల్లో కూడా కౌంటర్లు పూర్తిగా మూసివేయకూడదు, కనీసం ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులు రొటేషనల్ విధానంలో కస్టమర్లకు సేవలు అందించాలి.
Read Also: UPSC Results: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల
కస్టమర్లకు ఇబ్బంది అయితే ఫిర్యాదు చేయొచ్చు
లంచ్ బ్రేక్ పేరుతో బ్యాంక్ సర్వీసులు(Bank Rules) నిలిపి వేస్తే లేదా కస్టమర్లను వేచి ఉండమని చెబితే, వారు RBI కస్టమర్ కేర్ లేదా బ్యాంకింగ్ ఓంబుడ్స్‌మన్ వద్ద ఫిర్యాదు చేయవచ్చు.
RBI కస్టమర్ కేర్ నంబర్: 14440
లేదా https://cms.rbi.org.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
గతంలో లంచ్ బ్రేక్ ఉండేది
గతంలో బ్యాంకులు సాధారణంగా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ టైమ్ పాటించేవి. ఆ సమయంలో కౌంటర్లు మూసివేసేవారు. కానీ కస్టమర్ సౌకర్యం దృష్ట్యా, RBI తాజా మార్గదర్శకాల ప్రకారం రొటేషనల్ లంచ్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఈ మార్పుతో కస్టమర్లకు నిరంతర సేవలు అందడం, వేచి ఉండే సమయం తగ్గడం జరుగుతోంది. బ్యాంకులు కూడా ఇప్పుడు నో లంచ్ బ్రేక్ సర్వీస్ మోడల్ను అనుసరిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: