సైబర్ నేరాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ వెబ్‌సైట్లను “.bank.in” డొమైన్‌కు(Bank Domain) మార్చడం ప్రారంభించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశాల మేరకు ఈ మార్పు తప్పనిసరిగా చేయాల్సిందిగా సూచించింది. ఈ డొమైన్ మార్పుకు నిర్ణయించిన చివరి గడువు నేటితో ముగిసింది. RBI ఈ నిర్ణయం తీసుకున్నదే ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రతను బలోపేతం చేయడం కోసం. కొత్త డొమైన్ వాడకం ద్వారా ఫిషింగ్ వెబ్‌సైట్లు, నకిలీ లింకులు వంటి మోసపూరిత చర్యలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Read also: Asia Cup: ఆసియా కప్ ట్రోఫీపై బీసీసీఐ ఆగ్రహం!
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో
Bank Domain: ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చాయి. అదే విధంగా HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఈ సురక్షిత డొమైన్‌ను ఉపయోగించడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఇంకా .com డొమైన్‌తో కొనసాగుతున్నప్పటికీ, వినియోగదారులు ఏదైనా ఆన్‌లైన్ బ్యాంకింగ్ కేటగిరీని ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా .bank.in వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నారు. ఇలా మార్పు ద్వారా వినియోగదారులు మోసపూరిత సైట్ల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.
వినియోగదారులకు లభించే ప్రయోజనాలు
- ఫిషింగ్ దాడుల నివారణ
- బ్యాంకింగ్ లావాదేవీలకు అధిక భద్రత
- నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడంలో సులభత
- ఆన్‌లైన్ లావాదేవీలపై మరింత నమ్మకం
ఈ మార్పు ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం మరింత సురక్షితంగా మారనుందని RBI ఆశాభావం వ్యక్తం చేసింది.
బ్యాంకులు ఎందుకు .bank.in డొమైన్‌కు మారుతున్నాయి?
సైబర్ నేరాలను అరికట్టడం, ఆన్‌లైన్ లావాదేవీల భద్రత పెంచడం కోసం.
అన్ని బ్యాంకులు మారిపోయాయా?
SBI, PNB, HDFC, ICICI, AXIS వంటి ప్రధాన బ్యాంకులు మారాయి; మరికొన్ని దశలవారీగా మారుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: