Bank Account: చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ఖాతాలు చాలా కాలంగా ఉపయోగించకుండా అలాగే ఉండిపోతాయి. రెండు సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను బ్యాంకులు ఇనాపరేటివ్ లేదా డార్మెంట్ అకౌంట్లుగా గుర్తిస్తాయి.
Read Also: Srinagar Crime: శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం
ఇలాంటి ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయిన కారణంగా ఛార్జీలు విధిస్తామని కొన్ని బ్యాంకులు చెబుతుంటాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలు ప్రకారం, ఇనాపరేటివ్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదు. కస్టమర్లు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మీ ఖాతా రెండు సంవత్సరాలుగా ఉపయోగించకుండా ఉంటే, దాన్ని మూసివేయాలనుకుంటే ముందుగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి ఆ ఖాతాను మళ్లీ ఆపరేటివ్ స్టేటస్‌లోకి మార్చించుకోవాలి. అనంతరం ఎలాంటి పెనాల్టీలు లేదా అదనపు చార్జీలు చెల్లించకుండా ఖాతాను క్లోజ్ చేయాలని అభ్యర్థించవచ్చు. అయితే ఖాతా ఇనాపరేటివ్‌గా మారకముందు పెండింగ్‌లో ఉన్న ఛార్జీలు ఉంటే అవి మైనస్ బ్యాలెన్స్‌గా కనిపించవచ్చు. అలాంటి బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఖాతా మూసివేయడానికి, అకౌంట్ క్లోజర్ ఫారం నింపి డెబిట్ కార్డ్, చెక్‌బుక్‌లను బ్యాంక్‌కు తిరిగి అందజేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంకు సిబ్బంది మీ ఖాతాను అధికారికంగా క్లోజ్ చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: