📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Banglore: హెబ్బాళ్ ఫ్లైఓవర్ విస్తరణ వేగం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్

Author Icon By Pooja
Updated: December 6, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో(Banglore) ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, నగర అభివృద్ధి అధికారులు పరిష్కారాల కోసం చర్యలు ప్రారంభించారు. రాత్రింబవళ్లు వాహన రద్దీతో బాధపడుతున్న ముఖ్య మార్గాల్లో ఫ్లైఓవర్ల విస్తరణ పనులు చేపట్టారు. ప్రత్యేకంగా, హైదరాబాద్‌, కేం‍పేగౌడ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గాలలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో హెబ్బాళ ఫ్లైఓవర్‌కు అదనపు లూప్‌లను నిర్మిస్తున్నారు.

Read Also: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

Bangalore: Hebbal flyover expansion speed Check for traffic problems

హెబ్బాళ ఫ్లైఓవర్ (Banglore)విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నట్టు గ్రేటర్ బెంగళూరు అథారిటీ(Greater Bangalore Authority) అధికారులు వెల్లడించారు. షట్టరింగ్‌, రీఎన్‌ఫోర్స్‌మెంట్‌ వంటి నిర్మాణ కార్యకలాపాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే నగర శివార్ల నుంచి లోపలి ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు.

అదే సమయంలో, బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు, డేటాను విశ్లేషించేందుకు ఎఆయ్ ఆధారిత “మొబిలిటీ డిజిటల్ ట్విన్” మోడల్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోలీసు శాఖ కోటి రూపాయల వ్యయంతో టెండర్లు కూడా ఆహ్వానించింది.

ఈ మెరుగైన సాంకేతికత వల్ల నగర ట్రాఫిక్ స్థితిగతులను ముందుగానే విశ్లేషించి, అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది. ప్రపంచంలోని న్యూయార్క్, మాస్కో, బార్సిలోనా వంటి ప్రధాన నగరాల సరసన ఇప్పుడు బెంగళూరూ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించనున్నది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గి, ప్రయాణాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BDAProjects BengaluruTraffic Google News in Telugu HebbalFlyover Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.