భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం, అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిణామాల మధ్య, పాకిస్తాన్‌కు పొరుగుదేశంగా ఉన్న బంగ్లాదేశ్ తన వాణిజ్య, అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాల్లో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌కు చెందిన జాతీయ ఎయిర్‌లైన్స్ అయిన బిమాన్ ఎయిర్‌లైన్స్ తన విమానాలు సాధారణంగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించి టోరంటో, లండన్, రోమ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం పాక్ గగనతలాన్ని ఉపయోగించలేని పరిస్థితి దాల్చడంతో, ఈ మార్గాల్లో విమానాల షెడ్యూల్‌ను సమయపూర్వకంగా రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. ఈ మార్పులు మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ప్రధాన మార్పులు
ఢాకా-టొరంటో (BG305/306):
ఢాకా నుంచి బయలుదేరే సమయం 45 నిమిషాలు ముందుకు జరిపారు. ప్రస్తుతం ఉదయం 3:45 గంటలకు బదులుగా ఉదయం 3 గంటలకు షెడ్యూల్ చేశారు. అయితే, టొరంటో నుంచి తిరుగు ప్రయాణ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు ఉండదు.
ఢాకా-లండన్ (BG201/202):
ఢాకా నుంచి రెగ్యులర్ గా బయలుదేరే విమానాలు ఇప్పుడు ఉదయం 7 గంటలకు షెడ్యూల్ చేశారు. ఈ సర్వీస్ ఇంతకుముందు ఉదయం 7:40 గంటలకు ఉండేది. లండన్-ఢాకా తిరుగు ప్రయాణ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు. అయితే, గురువారం మాత్రం ఈ విమానం ఉదయం 8:50కి బదులుగా ఉదయం 8:10కి బయలుదేరుతుంది.
ఢాకా-రోమ్ (BG355/356):
ఢాకా నుంచి బయలుదేరే సమయం ఇప్పుడు ఉదయం 10:45 గంటలకు మార్చారు. ఇది ఇంతకుముందు ఉదయం 11:30 గంటలకు ఉండేది. ఇప్పుడు 45 నిమిషాలు ముందుగా ఉంటుంది. రోమ్ నుంచి తిరుగు ప్రయాణ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు.
ఈ మార్పులు తాత్కాలికంగా అమల్లో ఉండే నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు తగ్గట్టు ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోని చెక్-ఇన్ కౌంటర్లకు రిపోర్ట్ చేయాలని బిమాన్ అభ్యర్థించింది. రీషెడ్యూలింగ్ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులకు సంస్థ క్షమాపణలు తెలిపింది.
Read also: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ 32 విమానాశ్రయాలు మూసివేత