1975 ఆగస్టులో బంగ్లాదేశ్ లో (Bangladesh) జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని మార్చివేసింది. ఆ ఘర్షణల్లో ఆమె తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా కుటుంబ సభ్యులు హత్యకు గురాయ్యరు. ఆ సమయంలో హసీనా విదేశాల్లో ఉండటం వల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికారు. అనంతరం ఆదే దేశానికి తిరిగొచ్చారు.
Read Also : Bihar Elections : దేశ రాజకీయాలకు బీహార్ ఎన్నికలు దిక్సూచి ?
1996లో ప్రధానిగా బాధ్యతలు హసీనా(Hasina) మొదటిసారి 1996లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో అధికారం కోల్పోయారు. 2008లో భారీ విజయం సాధించి సుదీర్ఘ పాలన మొదలుపెట్టారు. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీయే గెలిచింది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరుగా చరిత్ర సృష్టించారు.
బంగ్లాను వేగంగా అభివృద్ధికి కృషి
ఆమె పాలనలో బంగ్లాదేశ్ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించింది. పేదరిక నిర్మూలనలో దేశం పురోగమించింది. బంగ్లాదేశ్ ప్రపంచ వస్త్ర పరిశ్రమకు కేంద్రగా మారింది. అయితే ఆమె అసమ్మతిని అణచివేసిందని, మీడియాపై ఆంక్షలు విధించిందని, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిందని ఇలా పలు ఆరోపణలు హసీనాపై వచ్చాయి.
2024లో ఉద్యోగాల్లో కోటాపై వ్యతిరేకత
2024లో స్వాతంత్ర్య పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా మొదలై విద్యార్థి నిరసనలు చివరికి దేశవవ్యాప్త తిరుగుబాటుగా మారాయి. ఈ నిరసనలే హసీనా పాలనను అంతం చేశాయి. ఆమె ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల వల్ల హింస పెరిగింది. ఈ అల్లర్లలో 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. దీంతో ఆమె ఆందోళనల మధ్యే భారత్ కు రావల్సి వచ్చింది. సోమవారం ట్రైబ్యునల్ ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :