📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: Bangladesh: మా అమ్మను అప్పగిస్తే బతకనివ్వరు.. హసీనా కుమారుడు

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రిబ్యూనల్ కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఆదేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమెను తమకు అప్పగించాలనే ఆ దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ భారత్ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం ఒకవేళ తన తల్లిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తే ఆమెను బతకనివ్వరని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని బంగ్లాదేశ్ కు అప్పగిస్తే అక్కడి మిలిటెంట్లు ఆమెను హతమారుస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞలు తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన భారత్ ను హెచ్చరించారు.

Read also : Sabarimala: పోటెత్తిన అయ్యప్ప భక్తులు..అవస్థలు పడ్తున్న వైనం

Bangladesh If my mother is handed over, she will not be allowed to live.. Hasina’s son

అపహాస్యం చేస్తోన్న న్యాయవ్యవస్థ: సాజీబ్

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీబ్ మాట్లాడుతూ.. తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వం న్యాయప్రక్రియను అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారని, 17మంది న్యాయమూర్తులను తొలగించి, పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించి విచారణ జరుపుతున్నారని విమర్శించారు. కనీసం డిఫెన్స్ లాయర్లను కూడా కోర్టులోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది అని, ఆమె బంగ్లాదేశ్ లోనే ఉండిఉంటే మిలిటెంట్లు చంపేసేవారని సాజీబ్ అన్నారు. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హసీనా హయాంలో అరెస్టయిన వేలాదిమంది ఉగ్రవాదులను విడుదల చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ లో స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. బంగ్లా ఉగ్రవాదంపై భారత ప్రధాని మోదీ కూడా చొరవ ఆందోశనతో ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక తన తల్లిని అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ తిరసస్కరిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Bangladesh political crisis democratic threat. fear of assassination Google News in Telugu Latest News in Telugu political asylum Sheikh Hasina Telugu News Today Wazed Joy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.