📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Bangalore: బెంగళూరు ఘటనలో తమిళనాడు కరస్పాండెంట్‌ మృతి

Author Icon By Sharanya
Updated: June 6, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌ వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్రికెటర్లను దగ్గర నుంచి చూడాలన్న ఉత్సాహం అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలై ప్రాంతానికి చెందిన యువతి కామాక్షిదేవి (28) ప్రాణాలు కోల్పోయారు.

ఘటన వివరాలు:

ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు క్రికెటర్లను స్టేడియం బయట నుంచి చూడడానికి వచ్చిన వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. క్రికెటర్లను చూసేందుకు వెళ్లిన ఆమె, జనసందోహంలో చిక్కుకుని కిందపడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

కామాక్షిదేవి వ్యక్తిగత జీవితం:

కామాక్షిదేవి అవివాహిత అయిన ఆమె ఉడుమలైలోని వివేకానంద విద్యాలయ పాఠశాలకు కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు బెంగళూరులోని రామమూర్తినగర్‌లో నివసిస్తూ అమెజాన్‌ ఇండియా కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది. క్రికెటర్లను దగ్గర నుంచి చూడాలన్న ఆసక్తితో స్టేడియం వద్దకు వెళ్లిన ఆమె, ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. కామాక్షిదేవి మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఉడుమలైలోని ఆమె స్వగ్రామానికి తరలించారు.

ప్రముఖుల స్పందన:

ఈ ఘటనపై ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందించారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “బెంగళూరులో జరిగిన ఈ విషాద ఘటన అత్యంత బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. “18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ జట్టుకు దక్కిన విజయోత్సాహం కొనసాగకుండా ఇలాంటి దుర్ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది” అని ఆమె ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు:

ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకుంటారని ముందుగానే అంచనా వేయకపోవడం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని వారు అంటున్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రేమలత తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్వగ్రామం ఉడుమలైకి తరలించి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి మధ్య ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు.

Read also: Kapil Dev : తొక్కిసలాటపై కపిల్ దేవ్ స్పందన

Sharmistha Panoly : శర్మిష్ఠ పనోలీకి ఊరట… బెయిల్ మంజూరు

#BangaloreTragedy #ChinnaswamyStadium #CrowdControl #KamakshiDevi #StampedeDeath #TamilNadu Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.