సుధామూర్తి (Sudhamurthy) అంటే భారతీయులకు ఓ ఆదర్శవనిత. కోట్లాది ఆస్తులున్నా ఎప్పుడూ సింపుల్గా కనిపించే ఆమె యూత్ కు ఆమెంటే ఓ ప్రత్యేక గౌరవం. ఆమె ఓ ప్రముఖ సంస్థ(ఇన్ఫోసిస్)కు అధినేత. కానీ ఆ భావాన్ని ఆమె ఎప్పుడూ ప్రదర్శించదు. సాధాసీదాగా కనిపించే సుధామూర్తి ఓ పెళ్లి వేడుకలో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. సుధామూర్తితో పాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశారు.
డెబ్భైల వయసులో ఉన్న ఇద్దరు మహిళలు బరాత్ సందర్భంగా డంబు లకు అనుగుణంగా స్టెప్పులేస్తూ కనిపించారు. చాలా ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేసి అక్కడి వాతావరణాన్నే ఆహ్లాదభరితంగా మార్చేశారు వీరిద్దరు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. దీనికి నెటిజన్ల నుంచి పలు కామెంట్లు కూడా వస్తున్నాయి. ‘ఇద్దరు శక్తివంతమైన మహిళలు పిల్లల్లా డ్యాన్స్ చేయడం చాలా బాగుంది’ అని కొందరు, ‘వీరి డ్యాన్స్ అనేకులకు ఇన్స్పిరేషన్’ అని కామెంట్ చేస్తున్నారు.
Read Also: New Rules: ఫాస్టాగ్ యూజర్లకు సెంట్రల్ గుడ్ న్యూస్ – కొత్త నియమాలు అమల్లోకి
దశాబ్దాలుగా సక్సెస్ మార్గాల్లో పయనిస్తూ..
వయసు, ఫేమ్ తో పనిలేకుండా ఆనందాన్ని ఎంజాయ్ చేయడం ఎలాగో వీరిని చూసి నేర్చుకోవాలంటున్నారు నెటిజన్లు. దశాబ్దాలుగా వారివారి రంగాల్లో సక్సెస్ అవ్వడంతోపాటు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. బెంగళూరులోని (Bangalore) తాజ్ వెస్ట్ ఎండ్ లో జరిగిన ఈ మ్యారేజ్ రిసెప్షన్ కి కర్ణాటక ఉప ముఖ్యమత్రి డిజె శివకుమార్, సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. శివకుమార్ ఎక్స్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కిరణ్ ముజుందార్ మేనల్లుడి ఎరిక్ ముజుందార్ది పెళ్లి వివాహ వేడుక కిరణ్ ముజుందార్ షా మేనల్లుడు ఎరికి ముజుందార్డి. ఈయన ఎరిక్ ఆష్లే పౌర్ణిమను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి రిసెప్షన్ ఇటీవలే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక వరుడు ఎరిక్ ముజుందార్ అందరి దృష్టిని ఆకరిస్తున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: