బెంగళూరు(Bangalore)లో తెలుగు టీవీ మరియు కన్నడ సీరియళ్లలో నటించే ఓ నటి ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు గురైన ఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ సంస్థలో డెలివరీ మేనేజర్గా పనిచేస్తున్న నవీన్ కెమరామెన్ గా గుర్తించారు.
Read Also: Srikakulam: పిల్లలుకు పాఠాలు చెప్పకుండా కాళ్ళు నొక్కించుకున్న టీచర్ నిర్వాకం
సమాచారం ప్రకారం, సుమారు మూడు నెలల క్రితం ‘నవీన్జ్’ అనే ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆ నటి కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించకపోయినా, నిందితుడు మెసెంజర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. తర్వాత ఆమె అతడిని బ్లాక్ చేయగా, కొత్త ఖాతాలు సృష్టించి వేధింపులను కొనసాగించాడు. బాధితురాలు తన ఫిర్యాదులో నిందితుడు అసభ్య వీడియోలు కూడా పంపినట్లు పేర్కొంది.
నవంబర్ 1న నిందితుడు మళ్లీ మెసేజ్ చేయడంతో, నటి అతడిని నేరుగా కలవాలని నిర్ణయించింది. ఆ సమయంలో కూడా అతడు వేధింపులు ఆపకపోవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
బెంగళూరులో మరో ఘటన:
ఇక నగరంలో మరో మహిళా వేధింపుల ఘటన వెలుగుచూసింది. శనివారం ఉదయం తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. వెనుక నుంచి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: