📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Bangalore Metro: మెట్రోలో లగేజ్‌పై అదనపు ఛార్జ్

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగరంలోని సామాన్యుల జీవితంలో ప్రతి చిన్న ఆర్థిక భారం ఒక్కొక్కసారి సవాలు అవుతుంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వారి కోసం నగర జీవితం సులభం కాదనే విషయం తెలిసిందే. ప్రతి అంశం, ముఖ్యంగా రవాణా, వారి జేబుకు నేరుగా తాకుతూనే ఉంటుంది. సొంత వాహనాలు ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్యలు, కాలవ్యవధి ఇబ్బందులు కారణంగా చాలా మంది మెట్రోలో ప్రయాణించడమే ఎంచుకుంటారు.ఇప్పటి వరకు మెట్రో ప్రయాణ ఛార్జీలు స్థిరంగా ఉండగా, ఇప్పుడు మరో ఆర్థిక భారం ప్రయాణికుల జేబుకు రావడం ఖాయం అయింది.సదరు విధానం ప్రయాణికుల కోసం సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, మెట్రో నెట్వర్క్ నిర్వహణలో సరిహద్దులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి తీసుకున్న ఒక పద్ధతి.లగేజ్ ఛార్జీ వసూలు అనేది బెంగళూరు మెట్రో (Bangalore Metro) లో. దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) తాజాగా మరోసారి ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అయ్యింది.

వైరల్ అవుతోంది

ప్రయాణికుల నుంచి అదనపు లగేజ్ రుసుమును విధిస్తుంది. దీనిపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రయాణికులపై ఇంకెంత భారం మోపుతారని ప్రశ్నిస్తుండగా, కొందరు మాత్రం, మెట్రో నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఓ ప్రయాణికుడు అదనపు లగేజ్ ఛార్జీ (Luggage charge) గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది.భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి బెంగళూరు మెట్రో అదనంగా ఛార్జీ వసూలు చేసిందంటూ ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేస్తూ,ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. లగేజ్ మీద ఇలాంటి అదనంగా ఛార్జ్ వసూలు చేయడం ఎంతవరకు సమర్థనీయం అంటూ పోస్ట్ చేయడంతో దీనిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అవినాష్ చంచల్ అనే వ్యక్తి,తన బ్యాంగ్ ఫొటో పోస్ట్ చేస్తూ, దానికిగాను బెంగళూరు మెట్రో తన దగ్గర నుంచి అదనంగా రూ.30 వసూలు చేసిందని తెలిపారు. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఎక్స్‌ట్రా ఛార్జ్ వసూలు చేస్తారని తెలిపారు

ఇప్పుడు అదనపు లగేజ్ ఛార్జ్‌తో మరింత భారంగా మారనుంది అంటూ పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ వైరల్ కావడమే కాక దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అదనపు ఛార్జ్ అంశంలో కొందరు చంచల్‌కు మద్దతివ్వగా.. మరి కొందరు మాత్రం.. అంత పెద్ద పెద్ద బ్యాగులు తీసుకుని మెట్రో ఎక్కినప్పుడు.. అవి మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయి. అందుకు అదనపు లగేజ్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇది సరైందే అంటున్నారు. పైగా బ్యాగ్ స్కానర్‌లో సరిపోయే దానికంటే పెద్దదిగా ఉంటేనే ఎక్స్‌ట్రా ఛార్జ్ వసూలు చేస్తారని తెలిపారు. తాను ఎన్నో పార్లు.. ఎలాంటి లగేజ్ ఛార్జ్ చెల్లించకుండానే సూట్‌కేస్, బ్యాక్‌ప్యాక్‌ను తీసుకెళ్లానని చెప్పుకొచ్చాడు. మరికొందరేమో లగేజీకి ప్రత్యేకంగా నిల్వ స్థలం కేటాయించి.. అప్పుడు లగేజ్‌కి రుసుము విధిస్తే బాగుంటుందని అంటున్నారు. మరి దీనిపై మెట్రో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ramdas-soren-jharkhand-education-minister-ramdas-soren-is-no-more/national/531552/

Bengaluru Metro luggage charges Bengaluru metro metro extra fees metro fare hike Namma Metro passengers complaint metro public transport Bengaluru Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.