📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangalore Crime: సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangalore Crime: చిన్నపాటి కుటుంబ కలహాలు ఒక్కోసారి ఊహించని విషాదాలకు దారితీస్తాయి. తాజాగా బెంగళూరులో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘వండిన సాంబార్’ విషయంలో తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

Read Also: Ram Rahim: జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

Bangalore Crime: Fight over sambar.. Illalu commits suicide

పురుగుల మందు తాగి బలవన్మరణం

అయితే 27 ఏళ్ల కావ్యకు, రంగస్వామికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సుఖంగా సాగుతున్న వీరి సంసారంలో గురువారం నాడు చిన్న సాంబార్ గిన్నె చిచ్చు పెట్టింది. మూడు రోజుల క్రితం వండిన సాంబార్‌ను కావ్య వేడి చేసి భర్తకు వడ్డించింది. పాత సాంబార్ వడ్డించావంటూ రంగస్వామి కావ్యపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో రంగస్వామి ఆమెను తీవ్రంగా దూషించి, దాడికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. అందరి ముందు భర్త అలా ప్రవర్తించడంతో కావ్య తీవ్ర అవమానానికి, మనస్తాపానికి గురైంది.

భర్త ప్రవర్తనతో తీవ్రంగా నొచ్చుకున్న కావ్య, ఇంట్లో వ్యవసాయానికి వాడే పురుగుల మందు తాగేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్ప‌టికే కావ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangalore Crime Bangalore Suicide Domestic Violence Kavya Suicide Stale Sambar Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.