📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bangalore:డెలివరీ బాయ్ ని కారుతో ఢీ కొట్టిన దంపతులు 

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bangalore) ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న గొడవకు కారణమైన బైక్ రైడర్‌ను కారులోని దంపతులు వెంటాడి మరీ ఢీకొట్టడంతో, ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.

Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

ప్రమాదం, గొడవ వివరాలు

బెంగళూరుకు చెందిన డెలివరీ బాయ్ దర్శన్, (Delivery boy Darshan) తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఈ నెల 22న అర్ధరాత్రి శ్రీరామ లేఅవుట్లో బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో, ఓ కారు పక్క నుంచి వెళుతుండగా, సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్ మరియు ఆయన భార్య ఆరతి శర్మ బైకుపై ఉన్న దర్శన్‌తో గొడవకు దిగారు. కొద్దిసేపటి తర్వాత దర్శన్ అక్కడి నుంచి వెళ్లిపోగా, మనోజ్, ఆరతి తమ కారులో అతడిని వెంటాడారు. దాదాపు 2 కిలోమీటర్లు వెంటాడి, బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు.

మరణం, ఆధారాలు చెరిపే ప్రయత్నం

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో(hospital) చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోగా, వరుణ్ కోలుకుంటున్నాడు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు భాగంలో పడిపోయిన కొన్ని పార్టులను, మనోజ్ మరియు ఆరతి మాస్కులు ధరించి వెనక్కి వచ్చి పట్టుకెళ్లారు. వరుణ్ ఫిర్యాదు మేరకు జేపీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, దంపతుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మనోజ్ మరియు ఆరతిలను బుధవారం అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Bengaluru crime Darshan delivery boy death. Google News in Telugu hit and run JP Nagar police Latest News in Telugu Manoj Kumar Police Arrest road rage murder Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.