📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Dog breeds: 6 ప్రమాదకర కుక్కల జాతులపై నిషేధం

Author Icon By Aanusha
Updated: November 1, 2025 • 7:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారుతోంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు రెండూ ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. పలు నగరాల్లో వీధుల్లో సంచరించే కుక్కల దాడులు పెరిగిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఈ దాడులకు గురవుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో, దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లి, దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: Bank Domain: బ్యాంకింగ్ సైట్లకు కొత్త డొమైన్‌!

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ (Chandigarh Municipal Corporation) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత, జంతు సంక్షేమం రెండింటినీ దృష్టిలో ఉంచుకుని “ది మున్సిపల్ కార్పొరేషన్ చండీగఢ్ పెట్ అండ్ కమ్యూనిటీ డాగ్స్ బై లాస్ 2025” నోటిఫై చేసింది.

ఈ కొత్త నిబంధనలు పెంపుడు కుక్కల యజమానులతో పాటు.. బ్రీడర్‌లు, పెట్ షాపుల యజమానులు, కమ్యూనిటీ డాగ్ కేర్‌గివర్‌లు అందరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.ప్రమాదకరం అని పేర్కొంటూ 6 రకాల శునకాల జాతుల (Dog breeds) పై చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. అమెరికన్ బుల్‌డాగ్, అమెరికన్ పిట్‌బుల్, బుల్ టెర్రియర్, కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్ వంటి ఆరు ప్రమాదకరమైన జాతులను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు

కొత్తగా ఈ జాతుల కుక్కలను (Dog breeds) రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికే ఇలాంటి జాతుల కుక్కలు ఉన్న యజమానులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కానీ.. 45 రోజుల్లోపు వారు తమ కుక్కలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ నిషేధిత జాతుల యజమానులు తమ కుక్కలను బయటకు తీసుకెళ్లేటప్పుడు అన్ని వేళలా ముక్కుతాడు,

Dog breeds

దాన్ని కంట్రోల్ చేయడానికి సరిపోయే బలమైన బెల్ట్‌ను ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కొత్త చట్టాలు నోటిఫై అయిన 45 రోజుల తర్వాత.. నిషేధిత కుక్కల జాతులను పెంచినా లేదా ఉంచినా జరిమానాతో పాటు కుక్కలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.వీటితోపాటు అన్ని కుక్కలకు రిజిస్ట్రేషన్ (Registration of dogs) తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

మలవిసర్జనను వాటి యజమానులు తమ సొంత

పెంపుడు కుక్కల మలవిసర్జనను వాటి యజమానులు తమ సొంత ప్రాంగణంలోనే చూసుకోవాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు విసర్జించిన మలం తొలగించకపోతే భారీగా జరిమానాలు విధించనున్నారు. సుఖ్నా సరస్సు, రోజ్ గార్డెన్ వంటి పబ్లిక్ గార్డెన్‌లు, బహిరంగ ప్రదేశాల్లోకి కుక్కలను అనుమతించరు.

బ్రీడర్‌లు, పెట్ షాపుల ఓనర్లు, ట్రైనర్‌లు తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.కుక్కల పెంపకానికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. నివాస గృహాల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని కుక్కలను పెంచుకోవచ్చో కూడా స్పష్టం చేసింది.

మున్సిపల్ కార్పొరేషన్ నిర్దేశించిన ప్రదేశంలోనే

152 చదరపు గజాల లోపు ఉన్న ఇంట్లో ఒక కుక్కను పెంచుకునేందుకు అనుమతించారు. 366 గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉండే ఇంట్లో రెండు కుక్కలు..

610 గజాలు ఉండే ఇంట్లో నాలుగు కుక్కల వరకు అనుమతిస్తారు.కమ్యూనిటీ కుక్కలకు ఆహారం అందించేవారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నిర్దేశించిన ప్రదేశంలోనే వాటికి ఆహారం అందించాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా లేదా మనుషులకు ప్రమాదం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం విసిరితే అది నేరంగా పరిగణించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Chandigarh Municipal Corporation latest news pet laws India street dogs problem Supreme Court Orders Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.