నదులు మన జీవితానికి ప్రాణాధారం. అయితే మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు నదుల అందాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. పంజాబ్‌లోని దోబా(Doaba) ప్రాంతంలో ప్రవహించే 160 కిలోమీటర్ల పొడవైన బియాస్ ఉపనది “కాళీబీన్” కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతో ఈ పవిత్ర నది మురికి కాలువగా మారిపోయింది. తాగునీరు దొరకక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also: AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్
ప్రజల సహకారం
ఈ పరిస్థితి చూసి పర్యావరణవేత్త బల్బీర్ సింగ్ సీచెవాల్(Balbir Singh Seechewal), ప్రజల్లో “ఎకో బాబా”గా పేరుగాంచిన వ్యక్తి, నదిని తిరిగి జీవంతో నింపాలని సంకల్పించారు. 2000వ సంవత్సరంలో నదిని శుభ్రపరచాలనే లక్ష్యంతో గ్రామస్థులలో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆయన పిలుపుతో 24కు పైగా గ్రామాల ప్రజలు చేతులు కలిపి విరాళాలు ఇచ్చారు. ఆ నిధులతో పరికరాలను కొనుగోలు చేసి నదీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజలు స్వచ్ఛందంగా శ్రమించి నదిలోని వ్యర్థాలను తొలగించారు.
ఆదర్శంగా నిలిచిన బాబా
ఎకో బాబా(Balbir Singh) ప్రజా అవగాహనతో పాటు మురుగునీటిని వేరే మార్గాల్లో పారించే విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశుభ్రమైన నదీ గర్భం, సహజ నీటి బుగ్గలు తిరిగి జీవం పొందాయి. పంజాబ్ ప్రభుత్వ సహాయంతో బల్బీర్ సింగ్ భూగర్భ మురుగునీటి వ్యవస్థ నమూనాను అభివృద్ధి చేశారు. దీనివల్ల శుభ్రపరచిన నీటిని వ్యవసాయం వంటి అవసరాలకు ఉపయోగించవచ్చు.
అతని కృషికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆయన పాఠశాలలు, కళాశాలలను స్థాపించి నేటి తరానికి విద్యా అవకాశాలు అందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: