వారణిసిలో కాశీవిశ్వనాథ స్వామిని హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) దర్శించుకున్నారు. సనాతన ధర్మం గురించి నేటి తరం తెలుసుకోవాలని, సనాతన సైనికుడిగానే అఖండ-2 సినిమాలో నటించానన్నారు బాలకృష్ణ. అఖండ-2 చిత్రానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నిర్మాతలు, దర్శకుడు కలిసి కలసి సినిమా గురించి వివరించారని బాలయ్య (Balakrishna)పేర్కొన్నారు.
Read Also: Dhurandhar Movie: భారీ ధరకు ‘ధురంధర్’ ఓటీటీ డీల్
బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది
సినిమా సందేశం, సనాతన ధర్మంపై ఉన్న అంశాలు ఆయనను ఆకట్టుకున్నాయని చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ (‘Akhanda 2’) భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది.ఈ మూవీ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.డిసెంబర్ 12న విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. .
అఖండ 2 చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య అఘోరగా కనిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: