Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో మంగళవారం (నవంబర్ 25, 2025) ప్రధాని నరేంద్ర మోదీ సాంప్రదాయబద్ధంగా కాషాయ ధ్వజాన్ని (ధర్మ ధ్వజం) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రామ మందిర నిర్మాణం పూర్తయిన సంకేతంగా నిలిచింది. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఇది ముగింపుగా నిలుస్తున్న ఘట్టమని ప్రధాని వ్యాఖ్యానించారు.
ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, “ఇది అయోధ్య మాత్రమే కాదు, భారత సాంస్కృతిక చైతన్యంలో ఒక చారిత్రాత్మక మలుపు. (Ram Mandir flag hoisting) శతాబ్దాల నాటి గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న బాధకు ఉపశమనం లభిస్తోంది. తరతరాలుగా చేసిన ఒక ప్రతిజ్ఞ ఈ రోజు నెరవేరింది” అని అన్నారు.
10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ త్రికోణాకార కాషాయ పతాకంపై సూర్యచిహ్నం, ‘ఓం’ గుర్తు, కోవిదార వృక్షం ప్రతీకలుగా ఉన్నాయి. ఇవి శ్రీరాముడి వీర్యశౌర్యం, ధర్మపాలనకు ప్రతిరూపాలని ప్రధాని పేర్కొన్నారు. రామమందిర గర్భగుడిలోని దైవిక శక్తి ఇప్పుడు ఆలయం శిఖరంపై ధర్మ ధ్వజం రూపంలో ప్రతిష్టితమైందని ఆయన వ్యాఖ్యానించారు.
Read also: Hyderabad: యూటీ ప్రచారంపై బీజేపీ కఠిన హెచ్చరిక
ఈ సందర్భంగా దేశం మానసిక బానిసత్వం నుంచి బయటపడే ప్రయాణంలో ఉందని మోదీ వ్యాఖ్యానించారు. విదేశీ ఆలోచనలే గొప్పవని భావించే ధోరణి నుంచి భారత సమాజం విముక్తి చెందుతోందని అన్నారు. ప్రజాస్వామ్యం భారత్‌కు బయట నుంచి వచ్చినది కాదని, అది భారతీయ సంస్కృతిలో సహజంగా నాటుకున్న విలువ అని స్పష్టం చేశారు.
రామ మందిర ప్రాంగణం భారత ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. అక్కడ వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యమహర్షులు, తులసీదాస్, శబరి మాత, నిషాదరాజు గుహ్యుడు వంటి మహనీయుల ఆలయాలు ఉండడం కలిసిన సంస్కృతి ప్రతిబింబమని తెలిపారు. జటాయువు, ఒక చిన్న గిల్లి విగ్రహాలూ చిన్న సేవలతోనూ మహత్తర లక్ష్యాలు సాధ్యమవుతాయన్న సందేశాన్ని ఇస్తాయన్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ వేడుక కొత్త యుగానికి శ్రీకారం చుట్టిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కాషాయ ధ్వజం ధర్మం, సత్యం, న్యాయం మాత్రమే కాదు, జాతీయ ఆత్మగౌరవానికి కూడా ప్రతీకగా నిలుస్తుందన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :