Ayodhya ram mandir : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ జన్మభూమి రామాలయానికి సంబంధించిన అన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆలయానికి సంబంధించిన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, పరిపాలనా పనులు అన్నీ ఏప్రిల్ 30 నాటికి పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.1,900 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటికే రూ.1,600 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం
ఆలయ నిర్మాణ బాధ్యతలను Larsen & Toubro (ఎల్ అండ్ టీ) మరియు Tata Consultancy Services (టీసీఎస్) కంపెనీలు చేపట్టాయి. మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మరో కొన్ని వారాల్లో పేపర్ వర్క్, బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాక ఆలయ నిర్వహణ పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లనుందని మిశ్రా తెలిపారు. భక్తుల కోసం మరింత సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: