हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Ayodhya: రాంలల్లా సింహాసనం ప్రతిష్ఠ..త్వరలో భక్తులకు దర్శనం

Sharanya
Ayodhya: రాంలల్లా సింహాసనం ప్రతిష్ఠ..త్వరలో భక్తులకు దర్శనం

అయోధ్యలో రామ భక్తులకు మరో శుభవార్త. చరిత్రలో ఓ ముఖ్యమైన మలుపుగా నిలిచిన ఈ సందర్భంలో, రాంలల్లా ఆశీనుడైన సింహాసనం మరియు 1949 నుండి భక్తులు పూజిస్తున్న గుడారాన్ని త్వరలో రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా అయోధ్య రామాలయం భక్తులకు మరింత ఆధ్యాత్మికతను, చారిత్రక అనుభూతిని అందించనుంది.

చారిత్రక నేపథ్యం:

1949లో రాంలల్లా విగ్రహం ఒక తాత్కాలిక గుడారంలో ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి ఇప్పటివరకు రాంలల్లా ఆ గుడారంలోనే భక్తుల దర్శనార్థం నిలిపివేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా రామమందిరంలో ప్రధాన విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా, ఈ సింహాసనం, గుడారం ట్రస్ట్ వద్ద భద్రంగా ఉంచబడ్డాయి. ఇప్పుడు వీటిని కూడా ఆలయంలోని ప్రత్యేక స్థలానికి తరలించి భక్తులకు దర్శనార్థం అందించనున్నారు.

సింహాసనం, గుడారం విశిష్టత:

ప్రస్తుతం రాంలల్లా విగ్రహాన్ని ఉంచిన సింహాసనం, గుడారం ఆలయ ట్రస్ట్ వద్ద ఉన్నాయి. వాటిని త్వరలో రామ మందిరానికి తరలించనున్నారు. ఆదివారం జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయాన్ని రక్షించడానికి శిఖరంపై రెండు లైట్లు, పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెండు లైట్లలో ఒకటి విమాన సిగ్నల్స్, ఆలయం మీదుగా ఎగురుతున్న విమానాలకు రెడ్ సిగ్నల్ ఇస్తుందని పేర్కొన్నారు. మరొకటి లైటింగ్ అరెస్టర్. పిడుగుపాటు నుంచి ఆలయాన్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు.

ప్రహరీ గోడ పనులు:

ఆలయ ప్రాకార (ప్రహరీ గోడ) పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశాం. ప్రాకార నిర్మాణ పనులే ఒక పెద్ద సవాలుగా మారాయి. పశ్చిమ వైపున ప్రాకారానికి, ఆలయానికి మధ్య ఒక వంతెన నిర్మిస్తున్నారు. అందులో ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 1949 నుంచి రాంలల్లాను ఉంచిన గుడారం, సింహాసనాన్ని రాబోయే మూడు, నాలుగు రోజుల్లో మందిరంలో ప్రతిష్ఠిస్తాం అని నృపేంద్ర మిశ్రా తెలిపారు.

రామదర్బార్​లో విగ్రహాల ప్రతిష్ఠ

మరోవైపు, అయోధ్య రామాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రామాలయం మొదటి అంతస్తులోని రామ దర్బార్ ​లో దేవతా విగ్రహాలను జూన్ 5న ప్రతిష్ఠించనున్నారు. తర్వాతి రోజు (జూన్ 6) నుంచి రామయ్య దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నట్లు ఇటీవలే రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. జూన్ 3 నుంచి అయోధ్య రామమందిరంలో మూడు రోజులపాటు మతపరమైన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అన్ని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జూన్ 5 నాటికి పూర్తవ్వనున్నాయి. ఆ తర్వాత రామ భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పిస్తారు.

Read also: Badrinath: తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870