Latest News: Supreme Court: చిన్న వయసు నుంచే లైంగిక విద్య పై అవగహన : సుప్రీంకోర్టు

Read Time:  1 min
Supreme Court
Supreme Court
FONT SIZE
GET APP

భారతదేశంలోని పాఠశాలల్లో లైంగిక విద్యను (Sex Education) పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంది.పిల్లలకు లైంగిక విద్యను కేవలం తొమ్మిది, పదో తరగతి వాళ్లకే కాకుండా.. అంతకంటే చిన్న వయస్సు నుంచే అందించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య… డీజీపీ పై కేసు!

న్యాయమూర్తులు సంజయ్ కుమార్, అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. యుక్త వయస్సు వచ్చే యువత (youth) కు కౌమార దశలో సంభవించే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన కల్పించేందుకు, లైంగిక విద్యను ఉన్నత సెకండరీ పాఠశాలల పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని ధర్మాసనం సూచించింది.”లైంగిక విద్యను పిల్లలకు 9వ తరగతి నుంచి కాకుండా..

చిన్న వయస్సు నుంచే అందించాలనే అభిప్రాయానికి మేము వచ్చాము. కౌమార దశ తర్వాత శరీరంలో జరిగే మార్పులు, వాటికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తత గురించి పిల్లలకు సమగ్రంగా తెలియజేసేందుకు సంబంధిత అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని ధర్మాసనం పేర్కొంది.

కీలక వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉంది

లైంగిక విద్యపై అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉంది.ఒక ప్రత్యేకమైన కేసు విచారణ. ఐపీసీ సెక్షన్లు 376, 506, పోక్సో చట్టం (POCSO Act) లోని సెక్షన్ 6 కింద అభియోగాలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీం కోర్టు (Supreme Court) ఈ పరిశీలనలను చేసింది.

Supreme Court
Supreme Court

ఆ నిందితుడు మైనర్ అని గుర్తించిన అపెక్స్ కోర్టు (Apex Court).. జువైనల్ జస్టిస్ బోర్డు (Juvenile Justice Board) నిర్ణయించే షరతులు, నిబంధనలకు లోబడి అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని ఇంతకుముందు ఆదేశించింది.సామాజిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో విద్య పాత్ర ఎంత కీలకమనే విషయాన్ని ఈ తీర్పు నొక్కి చెబుతోంది.

పిల్లల్లో లైంగికంగా సంభవించే మార్పులు

కౌమార దశలో ఉన్న పిల్లల్లో లైంగికంగా సంభవించే మార్పులు, సామాజిక అంశాల గురించి సరైన అవగాహన కలిగి ఉండకపోవడం వల్లనే వారు తరచుగా నేరాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కోర్టు పరోక్షంగా సూచించింది. సరైన సమయంలో.. సరైన అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి కేసుల సంఖ్యను తగ్గించవచ్చని,

తద్వారా పిల్లల భద్రతతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.సుప్రీం (Supreme Court) కోర్టు నిర్ణయం బాలల భవిష్యత్తు, సామాజిక బాధ్యత, లైంగిక అవగాహన విషయంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం స్కూల్ విద్యా విధానాన్ని మార్చడం మాత్రమే కాదు, సమాజానికి ఒక సానుకూల సంకేతం అందిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.