📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. చట్టాల తయారీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవే ప్రధాన వేదిక. ప్రజల భాధ్యతను మోయాల్సిన ఎంపీలు సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన 17 మంది ఎంపీల హాజరు శాతం, వారు అడిగిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చల వివరాలను వెలిబుచ్చే గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలు

జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజరుతో టాప్‌లో నిలిచారు. ఆయన 79 ప్రశ్నలు వేసి, 17 చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరుతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ నేత ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి, 91 శాతం హాజరుతో తన చురుకుదనాన్ని చాటుకున్నారు. ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొనడం గమనార్హం.

telangana mps parliament

కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు

మరోవైపు, కొంతమంది ఎంపీలు తక్కువ హాజరుతో పాటు, తక్కువ ప్రశ్నలు వేయడం, చర్చల్లో పాల్గొనకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఉదాహరణకు కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ కేవలం 8 ప్రశ్నలు వేసి, 72 శాతం హాజరుతో ఒక్క చర్చలోనూ పాల్గొనలేదు. ఇదే సమయంలో ఇతర ఎంపీల హాజరు శాతం, చర్చలలో భాగస్వామ్యం కూడా ఎంపీగా వారి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ గణాంకాలపై ప్రజల దృష్టి కేంద్రీకరించడంతో భవిష్యత్తులో ఎంపీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Attendance Parliament Telangana MPs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.