📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: BR Gavai: సీజేఐపై బూటుతో దాడికి యత్నం… ప్రధాని మోదీ స్పందన

Author Icon By Aanusha
Updated: October 6, 2025 • 10:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) లో సోమవారం ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) అధ్యక్షతన జరుగుతున్న విచారణ సమయంలో ఒక వ్యక్తి బూటు విసిరేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

CJI BR Gavai Attack : ఇది మన రాజ్యాంగంపై దాడి – సోనియా గాంధీ

ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన జస్టిస్ గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.వివరాల్లోకి వెళితే, సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా, న్యాయవాది దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి అనూహ్యంగా ధర్మాసనం వైపు దూసుకొచ్చాడు. సీజేఐ జస్టిస్ గవాయ్‌పైకి తన పాదరక్షను విసిరేందుకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ‘సనాతన ధర్మం’ గురించి నినాదాలు చేసినట్లు సమాచారం.ఈ అనూహ్య ఘటనతో విచారణకు కొద్దిసేపు అంతరాయం కలిగినా, సీజేఐ జస్టిస్ గవాయ్ ఏమాత్రం చలించలేదు.

 BR Gavai

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు

“ఇలాంటి వాటివల్ల మన ఏకాగ్రత దెబ్బతినకూడదు. మేం చలించం. ఇవి నన్ను ప్రభావితం చేయలేవు” అని వ్యాఖ్యానించి విచారణను కొనసాగించారు. ఆ తర్వాత, దాడికి యత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఆ విషయాన్ని విస్మరించాలని ఆయన సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.

“సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ప్రతి భారతీయుడినీ ఆగ్రహానికి గురిచేసింది. ఇలాంటి నీచమైన చర్యలకు మన సమాజంలో చోటు లేదు. ఇది తీవ్రంగా ఖండించదగింది” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

న్యాయ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోందని

క్లిష్ట పరిస్థితుల్లోనూ జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన సంయమనాన్ని ప్రశంసించారు. ఇది న్యాయ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోందని అభినందించారు.మరోవైపు, ఈ దుశ్చర్యను సుప్రీంకోర్టు అడ్వొకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (స్కోరా) ఏకగ్రీవ తీర్మానంతో ఖండించింది. న్యాయవాద వృత్తికే అవమానకరమైన ఈ చర్య, న్యాయస్థానం గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News cji br gavai latest news Narendra Modi reaction Supreme Court incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.