📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ATM: యుద్ధం వేళ ఏటీఎం లు పనిచేయవా?ఎస్బీఐ వివరణ

Author Icon By Sharanya
Updated: May 9, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో, ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ATM లు పని చేయవా? ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోతాయా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో – భారత్‌తో యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ హ్యాకర్లు ఏటీఎంలపై, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులపై సైబర్ దాడులకు సిద్ధమవుతున్నారని, “రెండు మూడు రోజులు ఏటీఎంలు పనిచేయవని”, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని వంటి సందేశాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారికంగా స్పందించింది.

ATM

ATMలు, ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవు: ఎస్బీఐ స్పష్టత

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అధికారిక ప్రకటనలో, పాకిస్తాన్ సైబర్ దాడులకు భారత బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితంగా ఉందని, ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫేక్ వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వేదికల ద్వారానే సమాచారం పొందాలని హెచ్చరించింది. భద్రతా కారణాల రీత్యా, ఎటువంటి అవసరం వచ్చినా తాము ముందస్తుగా ప్రజలకు తెలియజేస్తామని, కాని ATMలు మూతపడతాయన్న వార్తలు పూర్తిగా నిరాధారం కావంటూ ఎస్బీఐ తేల్చి చెప్పింది.

ఫేక్ న్యూస్‌పై కేంద్రం హెచ్చరికలు

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, మెసేజులలో చాలా వరకు పాతవి, వాస్తవాలకు దూరమైనవి అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. గుజరాత్ హజీరా పోర్ట్ పేలుడు అంటూ సర్కులేట్ అవుతున్న వీడియోలు కూడా 2021లో జరిగిన ఘటనకు సంబంధించినవని, ఇప్పుడు వాటిని అర్థంలేని విధంగా ప్రయోజనాలతో షేర్ చేస్తున్నారని తెలిపింది. దీనికి ఇక్కడితో బ్రేకులు పడట్లేదు. మరింత విస్తరిస్తూనే ఉన్నాయి. ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్.. సోషల్ మీడియా వేదికపై పోస్ట్ అవుతూనే వస్తోన్నాయి. భారత్‌తో యుద్ధం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్‌లోని అన్ని ఏటీఏంలపై సైబర్ దాడికి ప్రిపేర్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వాట్సప్‌లో ఈ సమాచారం పెద్ద ఎత్తున సర్కులేట్ అయింది. రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడతాయని, వినియోగదారులు కూడా ఎటువంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించకూడదనేది ఈ వాట్సప్ మెసేజీల సారాంశం. తెలియని అడ్రస్‌ల నుంచి ఇమెయిల్‌కు వచ్చిన ఏ లింక్ గానీ, అటాచ్‌మెంట్ గానీ క్లిక్ చేయొద్దని, అవి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చని ఇందులో రాశారు.

దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ ఫ్యాక్ట్ చెక్ ఇచ్చింది. ఈ వార్తలు అవాస్తవమని తేల్చింది. ఇందులో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఏటీఎంలు యధాతథంగా పని చేస్తాయని, బ్యాంక్ ఖాతాదారులు ఎటువంటి ఉద్రిక్తతలకు గురి కావొద్దని సూచించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు, డిజిటల్ సర్వీసులు పూర్తిస్థాయిలో పని చేస్తాయని పేర్కొంది.

Read also: Banks Offers: బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు..

#ATMServices #ATMUpdates #FinancialSecurity #PublicAwareness #SBIClarity #SBIUpdate #WarTimeATM Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.