हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:Atchannaidu: పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలి

Pooja
Telugu News:Atchannaidu: పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలి

విజయవాడ : ఒడిశాలోని గోపాలప్పూర్ సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో విసృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, వ్యవసాయ మరియు హార్టికల్చర్(Horticulture) అధికారులు తక్షణమే ఫీల్డ్లోకి దిగి పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశించారు.

Read Also: Karur Stampede:కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం

Atchannaidu

అవసరమైతే ఇతర జిల్లాల సిబ్బందిని కూడా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు తరలించి పంటల అంచనాలు వేయడంలో, రైతులకు సహాయం చేయడంలో వినియోగించుకోవాలని స్పష్టం
చేశారు. వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు జాగ్రత్తలపై తీసుకోవలసిన స్పష్టమైన సూచనలు అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని ఇరిగేషన్(Irrigation) అధికారులను ఆదేశించారు.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, విద్యుత్, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ప్రతి ఒక్క అధికారి కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్కన నిలబడి ఉంది. వాయుగుండం, వర్షాల ప్రభావం ఎంతటి సవాళ్లను విసిరినా, అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుని రైతులకు అండగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు.


ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్న అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు 24/7 ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో విదీళినీ, ళీదీళినీ, పోలీసు, ఫైర్ సిబ్బంది సమర్థంగా, వేగంగా స్పందించాలని మంత్రి స్పష్టం చేశారు. వంశధార, నాగావళి నదుల తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870