కర్ణాటకలోని (In Karnataka) విజయపుర జిల్లాలో ఓ భారీ చోరీ వెలుగు చూసింది. మంగళీ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ (Canara Bank) శాఖను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, 59 కిలోల బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ చోరీ ఆలస్యంగా బయటపడింది.వాస్తవానికి, ఈ బంగారం ప్రజలు తాకట్టు పెట్టిన ఆభరణాలు కావడం గమనార్హం. విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ బి. నింబార్గి ఈ వివరాలను మీడియాతో షేర్ చేశారు.బ్యాంకు మేనేజర్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, మే 23 సాయంత్రం బ్యాంక్ సిబ్బంది తాళం వేసి వెళ్లారు. తర్వాత శనివారం, ఆదివారం సెలవులు ఉండటంతో, బ్యాంక్ మూడు రోజులు మూసే ఉంది.మే 26న, ఓ గుమాస్తా బ్యాంక్ శుభ్రం చేయడానికి వచ్చాడు. అయితే, షట్టర్ తాళం కట్ చేయబడినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, దొంగలు లోపల చొరబడినట్లు స్పష్టమైంది. బ్యాంక్ నుంచి 59 కిలోల బంగారం మాయం అయిందని అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల ఆచూకీ ప్రయత్నాలు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని బంగారాన్ని పునరుద్ధరిస్తామని నింబార్గి హామీ ఇచ్చారు.
ప్రజల్లో ఆందోళన
బ్యాంకు లోపలికి దొంగలు ఇలా ప్రవేశించడం, తాకట్టు పెట్టిన ఆభరణాలే చోరీకి గురవడం గమనార్హం. తాకట్టు బంగారం కోల్పోతామని గ్రాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దృష్టిని ఆకర్షించింది. బ్యాంకు భద్రతపై పెద్ద చర్చ నడుస్తోంది.
Read Also : NEET PG 2025 : నీట్ పీజీ పరీక్ష వాయిదా..