📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Assam: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Assam: అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

Read Also: Central Government: గాడిదలు పెంచితే రూ.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం

Assam: Three Congress MLAs join BJP ahead of assembly elections

సస్పెన్షన్ వేటు.. ఆపై ఫిరాయింపు

బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజాప్రతినిధులు ఇలా పార్టీని వీడటం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఇటీవల సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన కొద్ది రోజుల్లోనే వీరు బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టడంతో ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Assam Elections 2026 Assam Politics Congress MLAs join BJP congress party Dilip Saikia Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.