Assam Silchar Gang Rape: అస్సాంలో దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది అఘాయిత్యం.

Read Time:  1 min
Assam Silchar Gang Rape
Assam Silchar Gang Rape
FONT SIZE
GET APP

Assam Silchar Gang Rape: వార్తా కథనం సిల్చార్, ఫిబ్రవరి 25:అస్సాం రాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసులు రెచ్చిపోయారు. 28 ఏళ్ల యువతిపై ఎనిమిది మంది దుండగులు తన ప్రియుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

Read Also: Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు

Assam Silchar Gang Rape: కత్తితో బెదిరించి దాడి

పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 19న అర్ధరాత్రి సిల్చార్‌లోని చెంగ్‌కురి బైపాస్ రోడ్డుపై ఓ యువతి, ఆమె ప్రియుడు తమ కారును నిలిపి లోపల కూర్చున్నారు. అదే సమయంలో ఒక SUV కారులో వచ్చిన ఎనిమిది మంది వ్యక్తులు వారి వద్దకు వెళ్లారు. మారణాయుధాలతో (కత్తులతో) ఆ జంటను బెదిరించి, వారిపై భౌతిక దాడికి దిగారు.

అమానవీయ ప్రవర్తన

దుండగులు యువతి ప్రియుడిని బంధించి, అతని కళ్లముందే ఆ యువతిపై ఒక్కొక్కరుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల గుర్తింపు కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మహిళల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.