📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Assam: భార్యతో విడాకులు తర్వాత పాలతో స్నానం చేసిన భర్త..

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అస్సాంలోని నల్బరీ జిల్లా ముకల్మువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ అనే వ్యక్తి తన భార్యతో చట్టబద్ధంగా విడాకులు పొందిన వెంటనే ఆనందోత్సవంలో భాగంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.ఈ సంఘటన భౌతికంగా చిన్నదైనా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యేలా ఈ వ్యక్తి తన జీవితంలోని ఒక కీలక మలుపుని సెలబ్రేట్ (Celebrate) చేసుకున్న విధానం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ, నేను కొత్తగా జన్మించినట్లు అనిపిస్తోందని చెప్పాడు. దాంపత్య జీవితం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా జీవిని అయ్యానంటూ తెలిపాడు.

తీవ్ర మనస్తాపానికి

అలాగే కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పాల స్నానాన్ని ఒక ప్రతీకగా ఎంచుకున్నట్లు వివరించాడు.అంతేకాకుండా తన భార్య గురించి కూడా చాలానే విషయాలను చెప్పాడు. తమకు పెళ్లై ఓ కుమారుడు కూడా పుట్టాక, భార్య ఇప్పటికే రెండు సార్లు ప్రియుడితో పారిపోయిందని గుర్తు చేశాడు. ఈ పరిస్థితి తనను, తన కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని వెల్లడించాడు. కానీ కుమారుడి భవిష్యత్ (Son future) దృష్టిలో పెట్టుకుని, నచ్చకపోయినా భార్యతో ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.రానంటున్నా పిల్లాడి కోసం ఆమెను ఇంటికి తీసుకువచ్చి పెట్టుకున్నానని, కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయి చివరకు విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు.

Assam: భార్యతో విడాకులు తర్వాత పాలతో స్నానం చేసిన భర్త..

మంచి పని చేశావు బ్రో

ఇకపై సంతోషంగా బతుకుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ మాణిక్ అలీ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మంచి పని చేశావు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వాళ్లతో కలిసుండడం కంటే నీవు ఒక్కడివే కుమారుడిని పెంచుకోవడం మంచిదంటూ వివరిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో పాల (Milk) ను వృథా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఘటన అస్సాంలో చర్చనీయాంశంగా మారింది.

అస్సాం చరిత్ర?

అస్సాం చరిత్ర అనేది వివిధ సామ్రాజ్యాలు, రాజవంశాలు, సంస్కృతుల మిళితంతో కూడిన ఓ గొప్ప వారసత్వగాథ. ఇది ప్రాచీన కాలం నుండి ప్రారంభమై, ఆధునిక శకం వరకు అనేక మలుపులను చూసింది.

అస్సాం జనాభా ఎంత?

2011 జనగణన ప్రకారం, అస్సాం రాష్ట్రం జనాభా మొత్తం 3,11,69,272 (3 కోట్లు 11 లక్షల 69 వేల 272) గా నమోదైంది. ఇది భారతదేశ మొత్తం జనాభాలో సుమారు 2.58% శాతాన్ని సూచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rajya Sabha: రాష్ట్రపతి కొత్తగా నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యులు వీరే

Assam viral news Breaking News Divorce celebration Assam man celebrates divorce with milk Manik Ali divorce news milk bath after divorce Nalbari Assam news Telugu News unique divorce reaction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.