📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Himanta Biswa Sarma : రూ.500 కోట్ల పరువునష్టం దావా, కాంగ్రెస్‌పై సీఎం సంచలన చర్య

Author Icon By Sai Kiran
Updated: February 10, 2026 • 8:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Himanta Biswa Sarma : అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు సీఎం హిమంత బిశ్వ శర్మపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 1200 బిఘాల భూమిని (దాదాపు 750 ఎకరాలు) అక్రమంగా ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు సీఎం వెల్లడించారు.

Read Also: Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

Himanta Biswa Sarma

ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేతలు తనపై అసత్య ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో జితేంద్ర సింగ్, గౌరవ్ గోగోయ్, భూపేంద్ర సింగ్ బఘేల్‌ల నుంచి రూ.500 కోట్ల పరిహారం కోరుతూ న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మరోవైపు సీఎం హిమంత బిశ్వ శర్మపై విమర్శలు చేశారు. ఓ వర్గంపై సీఎం విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు గువాహటిలోని పోలీసులకు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు అస్సాం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

500 crore defamation suit Assam CM news Assam Politics Breaking News in Telugu Congress allegations Assam Congress vs BJP Assam defamation case India Google News in Telugu himanta biswa sarma Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.