భారత్‌లో రైలు టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉన్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw)తెలిపారు. పొరుగు దేశాలతో పోల్చినా లేక అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా.. మన రైల్వే టికెట్ ధరలు తక్కువే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. టికెట్ ధరలను కనిష్ట స్థాయిలో ఉంచేందుకు భారతీయ రైల్వేశాఖ గతేడాది సుమారు 60 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుడు ఎంకే విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో మంత్రి వైష్ణవ్ (Ashwini Vaishnaw)సమాధానం ఇచ్చారు.
Read Also: http://RRB 2025: 2,569 ఉద్యోగాలకు దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్
కోవిడ్‌కు ముందు సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్‌లో డిస్కౌంట్ ఉండేదని, ఒకవేళ మళ్లీ ఆ విధానాన్ని ఏమైనా పునరుద్దరిస్తున్నారా అని కాంగ్రెస్ నేత అడిగారు. ఆ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో రైలు టికెట్ ధరలు కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఉన్నట్లు చెప్పారు. పొరుగు దేశాలతో పోలిస్తే కూడా మన రైలు టికెట్ ధరలు చాలా చాలా చౌకగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: