Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక స్థితి గత పదేండ్లలో మెరుగుపడింది

Read Time:  1 min
Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక స్థితి గత పదేండ్లలో మెరుగుపడింది
FONT SIZE
GET APP

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav), గత పదేళ్లలో దేశీయ రైల్వేల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందని వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేండ్లలో రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అని తెలిపారు.

Read Also: Supreme Court: పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం సూచనలు

వచ్చే మూడేండ్లలో మరో 1.5 లక్షల ఉద్యోగాలు

2014-24 మధ్య 5.04 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వచ్చే మూడేండ్లలో మరో 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు రూ. 1.18 లక్షల కోట్లు, పెన్షనర్లకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం ఏడాదికి రూ.2.74 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖర్చులు పోను రూ. 2,660 కోట్ల ఆదాయం వచ్చిందని అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.