📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News telugu: Asaduddin Owaisi: బీహార్‌లో సీమాంచల్ న్యాయ యాత్ర ద్వారా ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్

Author Icon By Sharanya
Updated: September 24, 2025 • 7:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల (Bihar Elections) నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. మహాఘట్‌బంధన్ కూటమిలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తన పార్టీకి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

‘సీమాంచల్ న్యాయ యాత్ర’ ద్వారా ప్రచారానికి శ్రీకారం

ఒవైసీ తన ఎన్నికల ప్రచారాన్ని ‘సీమాంచల్ న్యాయ యాత్ర’ (Seemanchal Legal Yatra)పేరుతో ప్రారంభించారు. యాత్రను బీహార్‌లోని కిషన్‌గంజ్ పట్టణంలో ప్రారంభించిన ఆయన, ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా మహాఘట్‌బంధన్‌లో భాగస్వామ్యం కోసం సంసిద్ధత వ్యక్తం చేశారు.

News telugu

ప్రతిపక్ష నేతకు లేఖ.. కలిసి పనిచేయడంపై స్పష్టత

ఒవైసీ మాట్లాడుతూ, బీహార్ మజ్లిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ద్వారా ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్కు లేఖ పంపినట్టు వెల్లడించారు. “బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు.“మేము స్పష్టమైన ప్రతిపాదన చేశాం. ఇప్పుడు నిర్ణయం మహాఘట్‌బంధన్ చేతిలో ఉంది” అని ఒవైసీ తెలిపారు. తమను తీసుకోకపోతే, ప్రజలు ఎవరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారో అర్థం చేసుకుంటారని అన్నారు.

చివరి నిర్ణయం ప్రజలదే: ఒవైసీ

భవిష్యత్తులో తమపై ఎలాంటి నిందలు లేకుండా ఉండేందుకు బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నామని ఒవైసీ తెలిపారు. “తుది నిర్ణయం బీహార్ ప్రజలదే. మేము ప్రతిపక్ష కూటమితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AIMIM Asaduddin Owaisi Bihar Elections 2025 Breaking News latest news Seemanchal Nyay Yatra Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.