📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu news : Arvind Kejriwal – ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ ఫైర్‌

Author Icon By Sudha
Updated: September 22, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడానికి ముందు మీరు దాన్ని ఆచరించి చూపాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీరు వాడుతున్న విదేశీ వస్తువులను బహిష్కరిస్తారా..? కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్‌ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘ప్రధాని గారూ, ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని మీరు కోరుతున్నారు. మీరు మీకుగా స్వదేశీ వస్తువులను వినియోగించడం మొదలుపెడుతారా..? మీరు రోజూ తిరుగుతున్న విదేశీ విమానాన్ని వదిలేస్తారా..? రోజంతా మీరు వినియోగిస్తున్న విదేశీ వస్తువులను విడిచిపెడుతారా..?’ అని ప్రశ్నించారు.

Arvind Kejriwal – ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ ఫైర్‌

అంతేగాక.. ‘దేశంలో ఉన్న నాలుగు అమెరికా కంపెనీలను మీరు మూసేస్తారా..? డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను, భారత ప్రజలను రోజూ అవమానిస్తున్నారు. మీరు ఏమీ చేయలేరా..? ప్రజలు వారి ప్రధాన మంత్రి నుంచి చర్యలు కోరుకుంటున్నారు. ఉపదేశాలు కాదు’ అని కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కూడా ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటలీ అద్దాలు, స్విట్జర్లాండ్‌ గడియారం, అమెరికా ఫోన్‌, జర్మనీ కార్లు, విదేశీ బ్రాండ్లకు చెందిన దుస్తులు, ఇతర వస్తువులను వాడుతున్నారని.. కానీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలని చెబుతున్నారని సంజయ్‌ సింగ్‌ విమర్శించారు.

అరవింద్ కేజ్రీవాల్ ఐపీఎస్ లేదా ఐఏఎస్?

సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 1995లో ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో చేరారు.

ఢిల్లీలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు?

 షీలా దీక్షిత్ ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, అలాగే భారత చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన మహిళా ముఖ్యమంత్రిగా, ఆమె 1998 నుండి 15 సంవత్సరాలు సేవలందించారు.

ఢిల్లీలో ఎమ్మెల్యే కాని వారు సీఎం కాగలరా?

ఒక ఎమ్మెల్యే మాత్రమే 6 నెలలకు పైగా మంత్రిగా పనిచేయగలరు. ఎమ్మెల్యే కాని వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మంత్రి అయితే, ఆ ఉద్యోగంలో కొనసాగడానికి 6 నెలల్లోపు ఎమ్మెల్యే అవ్వాలి. ఒక ఎమ్మెల్యే మాత్రమే శాసనసభ స్పీకర్ కాగలరు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rekha-gupta-evm-hack-comments-controversy/national/551801/

Arvind Kejriwal Breaking News Indian Politics Kejriwal Reaction latest news PM Modi Comments Swadeshi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.